twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామోజీని కాదన్న ఫలితం

    By Staff
    |

    Usha Parinayam
    తన తండ్రి రామోజీరావు చెప్పిన మాట వినకుండా సుమన్ ఉషాపరిణయం రిలీజ్ చేసాడు..నవ్వుల పాలయ్యాడు అంటున్నారు పెద్దాయన సానుభూతి పరులు. సుమన్ అన్నీ తానై తీసిన ఉషాపరిణయం మొదట ఈ టీవీ కోసం తీసింది. అయితే అది సినిమా స్టాండర్డ్ లో ఉందని సుమన్ ఫీలవటంతో అసలు చిక్కంతా వచ్చి పడింది. దాన్ని డిజిటల్ ఫార్మెట్ నుంచి వెండితెరకు అనుగుణంగా మార్చాడు. అంతే గాక తమ ఉషాకిరణ్ బ్యానర్ పై కాకుండా సుమన్ ఫిలింస్ పై నిర్మించాడు.

    పోస్టర్స్ పై సైతం టెక్నీషన్ల పేరు కూడా వెయ్యకుండా కేవలం సుమన్ అని వేసుకోవటం వారిని అవమానించినట్లే అంటున్నారు. అదే కొట్టి ఉషా పరిణయం కాస్తా తమాషా పరిణయం గా మారింది. మరో ప్రక్క రామోజిరావు గారి మయూరి డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా సినిమా రిలీజ్ చెయ్యలేదు. అలాగే వారి ధియోటర్స్ లోనూ ఈ చిత్రానికి చోటు దొరకలేదు. చూసిన కొద్ది మంది అసలు ఈ సినిమా ఊసు ఎత్తటానికే ఇష్టపడటం లేదు. విచిత్రంగా ఈ చిత్రానికి ఇప్పటివరకూ ఎక్కడా రివ్యూలు సైతం రాలేదు. ఇవన్నీ చూసిన తర్వాత అయినా సుమన్ తన ఫంధాను కాస్త మార్చుకుంటే బెటర్ అంటున్నారు..అది సాధ్యమయ్యే పనేనా...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X