'ఎవరి గోల వారిదే-2 ' నుంచి ఇవివి ఎందుకు తప్పుకున్నారు?
ఎవరి గోల వారిదే సీక్వెల్ ని లగడపాటి శ్రీధర్,ఇవివి సత్యనారాయణతో నిర్మిస్తున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లు సమాచారం. లారస్కో ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ రూల్స్ నచ్చక,విభేదించి ఇవివి బయిటకు వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీధర్ కూడా తనదైన శైలిలో కొన్ని నిభంధనలు పెట్టారని, అవి సృజనాత్మకతను దెబ్బ తీసే విధంగా ఉండటంతో ఇవివి హర్ట్ అయ్యారని అంటున్నారు. అందులోనూ ఇవివి ఈ మధ్య తీవ్రమైన అనారోగ్యం తో బాధపడి కోలుకుంటున్నారు. అయితే అంత బాధ లోనూ ఆయన తీసిన బెండు అప్పారావు ఆర్.ఎం.పి చిత్రం నవ్వులు పూయించి నిర్మాతకు ఆనందం కలగచేసింది. దాంతో ఈ సీక్వెల్ ప్రాజెక్టు మరొకరు భుజాన ఎత్తుకుంటారని ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఇంతకు ముందు కూడా లగడపాటి శ్రీధర్, వీరూ పోట్ల తో సినిమా ప్రకటించి తప్పుకున్నారు. ప్రస్తుతం వీరూ పోట్ల మనోజ్ హీరోగా బిందాస్ చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











