Evaru Meelo Koteswarulu Leaks: దుమ్ము దులిపేసిన మహేష్.. ఎన్ని లక్షలు గెలిచారంటే.. ?

తెలుగు టెలివిజన్ లో కౌన్ బనేగా కరోడ్‌పతికి తెలుగు రూపం 'మీలో ఎవరు కోటీశ్వరుడు షో'ను ఇటీవలే ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే పేరుతో ప్రారంభమై తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గత మూడు వారాలకు పైగా కొనసాగుతున్న ఈ షోకు మంచి ఆదరణ మాత్రమే కాకుండా టీఆర్పీ కూడా దక్కుతుంది.

అయితే ఈ షోతో పాటు పోటాపోటీగా బిగ్ బాస్ కూడా ఉండడంతో ఎక్కువగా సెలబ్రిటీ గెస్టులను తీసుకొచ్చి షో చేయించడానికి చూస్తున్నారు. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు మహేష్ బాబు పాల్గొన్న తాజా ఎపిసోడ్ లో ఆయన ఎంత గెలుచుకున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

మొదటి ఎపిసోడ్ తోనే

మొదటి ఎపిసోడ్ తోనే

టెలివిజన్ షోలు చేయడంలో మంచి అనుభవం సంపాదించిన ఎన్టీఆర్ ఈ షోను తనదైన శైలిలో పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా నిన్న టెలికాస్ట్ అయినా ఎపిసోడ్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ ముఖ్య అతిథులుగా వచ్చారు. నిజానికి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కర్టెన్ రైజర్ తోనే అదరగొట్టాడు. తన స్నేహితుడు, ఆర్ ఆర్ ఆర్ కో స్టార్ మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో చేసిన మొదటి ఎపిసోడ్ మోస్ట్ టీఆర్పీ సాధించిన ఎపిసోడ్‌గా సాగింది.

సెలబ్రిటీ స్పెషల్

సెలబ్రిటీ స్పెషల్

దీంతో సెలబ్రిటీలను ఈ షోకు తీసుకురావాలనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న క్రమంలో ఎన్టీఆర్ కెరీర్ లో మంచి హిట్ సినిమాలు ఇచ్చిన ఎస్ఎస్ రాజమౌళి కాగా, కొరటాల శివలు ఒక ఎపిసోడ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. తాజా ప్రచారం మేరకు ఈ షోకి ముఖ్య అతిథిగా మహేష్ బాబు హాజరైనట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా నిన్న జరిగిందని అంటున్నారు.

ఎంత గెలుచుకున్నారంటె

ఎంత గెలుచుకున్నారంటె

ఇక తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఈ షోలో మహేష్ బాబు మొత్తం పాతిక లక్షల రూపాయలు గెలుచుకోగా, ఆ గెలుచుకున్న పాతిక లక్షలు ఛారిటీకి దానం చేసినట్లు చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ అయితే దసరా సందర్భంగా టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇదంతా ప్రచారమే కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మంచి బాండ్

మంచి బాండ్

ఎన్టీఆర్, మహేష్ మధ్య మంచి బాండ్ ఉంది, వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ మహేష్‌ ని అన్నా అని పిలుస్తారు. ఆ అనుబంధం కారణంగానే మహేష్‌ బాబు భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం మహేష్‌ బాబు ఈ షోకు వస్తుండడం విశేషం.

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
ఇన్నేళ్ళ తర్వాత

ఇన్నేళ్ళ తర్వాత

మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మహేష్, ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు వేదిక ద్వారా కలిసి కనిపించనున్నారని అంటున్నారు. ఈ ఇద్దరు టాప్ స్టార్స్ పాల్గొనే ఈ ఎపిసోడ్ టీఆర్పీ ఒక రేంజ్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు అంటున్నారు. చూడాలిఎన్టీఆర్ - మహేష్‌ కలిసి చేసిన ఈ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ లో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X