బిగ్‌బాస్ 3: ఎన్టీఆర్, నాని తర్వాత.. సీనియర్ హీరోని కలిశారా!
గత ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. కౌశల్ విజేతగా, సింగర్ గీత మాధురి రన్నరప్ గా నిలిచారు. నాని హోస్టింగ్ సీజన్ మొత్తం ఆకట్టుకుంది. గణేష్, నూతన్ నాయుడు లాంటి సాధారణ వ్యక్తులు బిగ్ బాస్ 2 ద్వారా సెలెబ్రిటీలుగా మారారు. వివాదాలు, సరదాలు, భావోద్వేగాలు ఇలా మధురమైన జ్ఞాపకాలని బిగ్ బాస్ 2 కంటెస్టెంట్స్ కు మిగిల్చింది. ఈ ఏడాది జరగబోయే బిగ్ బాస్ సీజన్ 3 కి సంబంధించి చర్చ మొదలైపోయింది. హోస్ట్ గా ఎవరు అయితే బావుంటుందని ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు.

తొలి సీజన్‌కు ఎన్టీఆర్
తెలుగు బిగ్ బాస్ తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఎన్టీఆర్ క్రేజ్ తో ఈ సీజన్ సూపర్ సక్సెస్ గా నిలిచింది. తొలి సీజన్ కు మంచి టిఆర్పి రేటింగులు నమోదయ్యాయి. ఇక రెండవ సీజన్ ని అంతకు మించిన మసాలా అంటూ అంచనాలు పెంచారు. ఏదైనా జరగొచ్చు అంటూ ఊరించారు. నాని హోస్ట్ గా బాగా చేశాడు. కానీ బిగ్ బాస్ 2పై మాత్రం కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. ఇకపై ఎలాంటి వివాదాలకు తావు లేకుండా బిగ్ బాస్ 3 ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

హోస్ట్‌గా ఎవరు
సీజన్ 3కి హోస్ట్ ఎవరనే విషయంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ చేసే అవకాశం ఉందని, ఎన్టీఆర్ మల్లి రంగంలోకి దిగుతాడని ఊహాగానాలు వినిపించాయి. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది. ఇదిలా తాజాగా బిగ్ బాస్ 3 హోస్ట్ విషయంలో సీనియర్ స్టార్ హీరో పేరు వైరల్ అవుతోంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఈ మేరకు అతడితో చర్చలు జరిపారనేది తాజా సమాచారం.

ఫ్యామిలీ ఆడియన్స్ అభిమాన హీరో
బిగ్ బాస్ 3 హోస్ట్ గా వినిపిస్తున్న పేరు మరెవరిదో కాదు.. విక్టరీ వెంకటేష్. వెంకీ మీడియా, టివి ఇలాంటి పబ్లిసిటీ అంశాలకు చాలా దూరంగా ఉంటారు. లాంటిది వెంకీ పేరు వినిపిస్తుడడంతో ఆశ్చర్యం వేయక మానదు. కానీ బిగ్ బాస్ నిర్వాహకుల ఆలోచన హోస్ట్ అంటే హుందాగా వ్యవహరించాలి. ఆ విషయంలో వెంకటేష్ కు ఎలాంటి మచ్చ లేదు. ఏ సందర్భంలో అయినా కూడా వెంకీ హుందాగానే కనిపిస్తారు. పైగా వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ కు అభిమాన హీరో. ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకులకు, వెంకీకి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఆ విమర్శని తొలగించేందుకు
బిగ్ బాస్ సీజన్ 2పై వినిపించిన ప్రధాన విమర్శ ఫ్యామిలీ చూడలేని విధంగా ఉంది. అలాంటి పొరపాట్లు ఇకపై రిపీట్ కాకూడదని బిగ్ బాస్ టీం భావిస్తోంది. అందులో మొదటి అడుగుగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆకర్షించే వెంకటేష్ హోస్ట్ గా చేస్తే పాజిటివ్ బజ్ మొదలవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. బిగ్ బాస్ సీజన్ 3 జూన్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











