అజ్ఝాతంలోనికి వెళ్ళిపోయిన ‘ఇంకోసారి’ హీరో
'ఆనంద్" సాధించిన అనూహ్య విజయాన్ని ఆసరా చేసుకుని అనాసాయంగా ఇప్పటికి ఓ ఇరవై సినిమాల్లో నటించేసి ఆ ఇరవై చిత్రాల నిర్మాతలను నిట్ట నిలువునా నట్టేట్లో ముంచేసిన రాజా..గత ఆరు నెలలుగా ఎక్కడా కనిపించడం లేదు. తను నటించిన 'ఇంకోసారి" చిత్రాన్ని ప్రేక్షకులు చూడకుండా అడ్డుపడుతున్నారంటూ పరిశ్రమలోని కొందరు పెద్దలపై పేర్లు పెట్టి మరీ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఆతర్వాత కొద్ది రోజలకు సూసైడ్ అటెంప్ట్ చేశాడని వర్తాలు వచ్చాయి. అయితే వాటి ద్వారా ఏమి సాధించలేక పవడంతో రాజా ఆ తర్వాత నుంచి అజ్ఝాతంలోకి వెళ్లిపోయాడు. రాజా నటిస్తున్న చిత్రం కూడా ప్రస్తుతం ఏదీ ఉన్నట్లు లేదు.
'ఆనంద్" చిత్రంతో రాజాకు..రాజాలాంటి లైఫ్ ఇచ్చిన శేఖర్ కమ్ముల అతనికి మళ్లీ ఏదైనా అవకాశమిస్తాడా అంటె అటువంటి అవకాశం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే 'ఆనంద్" సినిమా విడుదలయ్యేసరికే రాజాకు శేఖర్ తో చెడిపోయింది. 'ఆనంద్" తర్వాత శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రాల వేడుకల్లో రాజా కాని, రాజా నటించిన చిత్రాలకు సంబంధించిన ఫంక్షన్లలో శేఖర్ కమ్ముల కాని ఎప్పుడూ కనిపించకపోవడమే ఇందుకు ఉదాహరణ.


Click it and Unblock the Notifications











