కొడుకు బర్త్ డేకు వెలకట్టలేని గిఫ్ట్: మహేష్ బాబు ప్లాన్...
హైదరాబాద్: మహేష్ బాబుకు తన కొడుకు గౌతమ్ కృష్ణ అంటే ఎంత ఇష్టమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గౌతమ్ కృష్ణ గత పుట్టినరోజున కోటి రూపాయల విలువైన కారును గిఫ్టుగా ఇచ్చాడు మహేష్ బాబు. ఈ సారి తన కొడుకు కోసం వెలకట్టలేని బహుమతి ఇవ్వబోతున్నడు మహేష్.
మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'ఆగడు' ఆడియో విడుదల కార్యక్రమాన్ని కొడుకు పుట్టినరోజు(ఆగస్టు 31) నాడే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గౌతం కృష్ణ ఆడియో సీడీలు విడుదల చేయనున్నారు. మరో వైపు మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9న ఆగడు ట్రైలర్ విడుదల అవుతోంది.
14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెంచింది. ఇక ట్రైలర్ అదిరిపోయే విధంగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్.

ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. అందులో ఆమె బికినీలో కనిపిస్తుందని కూడా ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది. దాదాపు నాలుగు నిమిషాల పాటు ఉండే ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్ అవుతుందంటున్నారు. దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల, నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఈచిత్రంలో సోనూసూద్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, నెపోలియన్, సాయికుమార్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.


Click it and Unblock the Notifications











