F3లో మరో స్టార్.. మళ్ళీ ఏదో మ్యాజిక్ క్రియేట్ చేసేలా ఉన్నారు!
బిగ్ బడ్జెట్ సినిమాలకంటే కూడా చిన్న తరహా కామెడీ సినిమాలే ఎక్కువ లాభాలను అందిస్తాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దర్శకుడు అనిల్ రావిపూడి F2 సినిమాతో ఇదివరకే ఆ ఫార్ములా సక్సెస్ అయ్యేలా చేశాడు. దానికి తోడు దిల్ రాజు బిజినెస్ మైండ్ కూడా సినిమాకు బాగానే ఉపయోగపడింది. సినిమా షూటింగ్స్ కంటే ముందు హీరోలకు అడ్వాన్స్ లు మాత్రమే అందించి బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చిన తరువాత పూర్తి రెమ్యునరేషన్ ని సెటిల్మెంట్ చేశాడు.
ఇక నెక్స్ట్ మళ్ళీ F2 తరహాలోనే F3 కథ కోసం ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియదు గాని అభిమానుల్లో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. అందులో మరొక హీరో కూడా నటించబోతున్నట్లు దర్శకుడు ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. కానీ ఆ హీరో ఎవరనే విషయంలో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఆయితే రూమర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి. సునీల్ దాదాపు ఫిక్స్ అయినట్లేనని చెబుతున్నారు.

ముందుగా రవితేజ, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది. హీరోయిన్స్ విషయంలో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇక ఫైనల్ గా మూడవ హీరో పాత్రకు సునీల్ అయితే సెట్టవుతాడాని దిల్ రాజు నిర్ణయం తీసుకోవడంతో అనిల్ రావిపూడి కూడా ఒప్పుకున్నట్లు టాక్ వస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు టాక్. ఇక ప్రస్తుతం కమెడియన్ ట్రాక్ ఎక్కిన సునీల్ F3తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











