అభిషేక్ ప్రియురాలు ప్రెగ్నెంట్? ఐశ్వర్యకు తీరని అన్యాయం ! అందుకే..
Aishwarya Rai- Abhishek Bachchan divorce: బాలీవుడ్ మోస్ట్ బ్యూటీ కపుల్ అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్. వీరిద్దరూ తమ జీవితాన్ని సంతోషంగా లీడ్ చేస్తున్నా.. గత కొంతకాలంగా ఈ జంట మధ్య మనస్పర్ధలు తలెత్తాయని, వారు తమ వివాహ బంధాన్ని తెంచు కోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వీరి విడాకులకు కారణం ఇవే అంటూ.. పలు రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇలా నిత్యం ఏదోక పుకారుతో ప్రజల్లో నానుతున్నారు వీరిద్దరూ. తాజాగా మరో కొత్త రూమర్ తో అభిషేక్- ఐశ్యర్య జంట వార్తల్లో నిలిచింది. ఇంతకీ జరిగిందంటే?
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ లకు బీటౌన్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. వీరి కెరీర్ టాప్ లో ఉన్నప్పుడే.. 2007లో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఆరాధ్య అనే పాప పుట్టింది. గత 16 ఏండ్లుగా వీరి కాపురం సంతోషంగా సాగుతోంది. అయితే.. గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయనీ, అభిషేక్- ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

విడాకుల వార్తలపై అభిషేక్- ఐశ్వర్యరాయ్ లు పరోక్షంగా క్లారిటీ ఇచ్చినా.. ఈ రుమర్లు మాత్రం ఆగడం లేదు. అసలేం జరిగిందంటే..? అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ పెళ్లిలో సమయంలో కూడా అభిషేక్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తెరపైకి వచ్చాయి. వారిద్దరూ విడిపోతున్నారనే.. రూమర్స్ క్రియేట్ అయ్యాయి. కారణమేంటంటే.. ఈ పెళ్లికి ఐశ్వర్యరాయ్.. అభిషేక్ ఫ్యామిలీ కాకుండా.. తన కూతురు ఆద్యతో కలిసి వచ్చారు. అభిషేక్ బచ్చన్ మాత్రం తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. పైగా ఈ ఈవెంట్ లో తన మామయ్య అమితాబచ్చన్ మాజీ ప్రేయసి రేఖతో ఐశ్యర్య రాయ్ మాట్లాడటం. ఈ విషయం బచ్చన్ ఫ్యామిలీకి కూడా మింగుడుపడేదనే వార్తలు వచ్చాయి.
అంతకు ముందు ఐశ్యర్య రాయ్ .. సింగల్ గా ఫారెన్ ట్రిప్స్ కు వెళ్లడం. విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు ఎయిర్ పోర్టుకు బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఎవరు రాకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. అంతే కాదు.. ఈ సమయంలో నటి ఐశ్వర్య రాయ్ తన చైల్డ్ వుడ్ ఫ్రెండ్ తో సన్నిహితంగా ఉంటుందనీ, అతనిపై మోజుతో వివాహం చేసుకోవాలని అనుకుంటుందని, అందుకే హీరో అభిషేక్ విడాకులు ఇవ్వబోతుందనే అనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ, ఇందులో ఎటువంటి నిజం లేదు.ఇలా ఎన్నో పుకార్లు వస్తునే ఉన్నాయి.

విడాకుల పుకార్లపై ఐశ్వర్యరాయ్, అభిషేక్ లు క్లారిటీ ఇస్తున్నా.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తున్నా ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఈ తరుణంలో బాలీవుడ్ మొత్తం షేక్ అయ్యేలా మరో వార్త వైరల్ అయ్యింది. అభిషేక్ బచ్చన్.. బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ తో సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి 'దస్వి' అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య స్నేహం ఏర్పడిందనీ, ఆ ఫ్రెండ్ షిప్.. మరింత పెరిగి.. రిలేషన్ స్థాయికి చేరుకుందనీ, ఆ బ్యూటీపై మోజుపడి తన భార్య ఐశ్వర్యరాయ్ కి విడాకులు ఇవ్వబోతున్నట్లు పుకార్లు షికార్లు చేశారు.
ఇక తాజాగా మరో షాకింగ్ రూమర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నటి నిమ్రత్ కౌర్‌ను నటుడు అభిషేక్ బచ్చన్‌తో ముడిపెట్టి పలు రూమర్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా సోషల్ మీడియాలో అభిషేక్ కారణంగానే నిమ్రత్ కౌర్ గర్భవతి అనీ, ఆమె త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందనే ప్రచారం జరుగుతోంది . ప్రస్తుతం సోషల్ మీడియాలో నిమ్రత్ ప్రెగ్నెంట్ అని ఓ ఇంస్టాగ్రామ్ పోస్టు వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ గర్భవతి అని, పుట్టబోయేది మగ శిశువు అని పేర్కొన్నారు.
అయితే ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే భారతదేశంలో లింగ నిర్ధారణ అనేది చట్ట విరుద్ధం. అలాంటి పనులకు చర్యలకు పాల్పడితే శిక్షార్హం. కాబట్టి లింక నిర్ధారణ పరీక్షలు భారతదేశంలో ఇక్కడ జరగడం లేదనేది వాస్తవం. ఐశ్వర్యారాయ్ అభిషేకలు విడిపోతున్నారు అనే రూమర్స్ క్రియేట్ అవుతున్న తరుణంలో ఆ పుకార్లకు మరింత బలం చేకూరేలా ఒక నకిలీ పోస్టు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మీడియాకు వార్తలపై స్టార్ కపుల్స్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో తాము కలిసే ఉన్నామని ప్రకటనలు చేస్తున్న ఈ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త రూమర్సు క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఈ రూమర్స్ కు ఎప్పుడు తెర పడుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











