Divorce: స్టార్ హీరోకు భార్య విడాకులు! నావల్ల కావట్లేదు అంటూ హీరోయిన్ పోస్ట్‌

ఇటీవలి కాలంలో టాలీవుడ్ టూ బాలీవుడ్ విడాకుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు? ఎవరు? విడాకులు అంటారో తెలియడం లేదు. కొద్దిరోజుల క్రితం మ్యూజిక్ మ్యాస్ట్రో, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ విడాకుల వ్యవహారం చిత్రసీమలో కలకలం రేపింది. ఆ తర్వాత మరికొందరు స్టార్స్ కూడా విడాకులు తీసుకుంటున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా మరో స్టార్ కపుల్ కూడా విడిపోతున్నట్లుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. వీటికి బలాన్ని చేకూర్చేలా సదరు హీరోయిన్ పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది . ఈ వివరాల్లోకి వెళితే..

మలయాళ స్టార్ కపుల్ నజ్రియా నజీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజా రాణి సినిమాలో తన అందం, చలాకీతనంతో ఆడియన్స్‌ని మాయ చేసింది. ఈ ఒక్క సినిమాతో సౌత్ మొత్తాన్ని తనవైపుకు తిపుకున్న నజ్రియా ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. తమకు గర్ల్‌ఫ్రెండ్ ఉంటే అచ్చం ఆమెలాగే ఉండాలి అన్నట్లుగా యూత్‌కు కలల రాకుమారిగా మారిపోయారు. అందాల ఆరబోతకు దూరంగా, సెలెక్టెడ్‌గా సినిమాలు చూస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Fahadh Faasil wife nazriya nazim make sensational post on her personal life

రాజా రాణితో స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చినా మధ్యలో నాలుగేళ్లు బ్రేక్ తీసుకున్నారు నజ్రియా. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికి సినిమాతో తెలుగువారిని పలకరించారు నజ్రియా. ఆ తర్వాత రెండేళ్లకు ఆమె క్రైమ్ థ్రిల్లర్ సూక్ష్మదర్శినిలో నటించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఏమైందో ఏమో కానీ అభిమానులకు, స్నేహితులకు, సినీ ప్రముఖులకు నజ్రియా దూరంగా ఉంటున్నారు. చివరికి 30వ పుట్టినరోజు వేడుకలకు, న్యూఇయర్ సెలబ్రేషన్స్, సక్సెస్ మీట్‌లు ఇలా దేనికీ కూడా నజ్రియా హాజరు కాకపోవడంతో ఆమెకు ఏమైందా అని మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి.

ఇంకొందరైతే ఫహద్ ఫాజిల్‌తో నజ్రియా విడిపోతున్నారని అందుకే డిప్రెషన్‌లోకి వెళ్లారని పుకార్లు రేపారు. ఇంత జరుగుతున్నా నజ్రియా ఏమాత్రం స్పందించలేదు. తాజాగా నజ్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ పెట్టారు. గత కొద్దిరోజులుగా తాను అందుబాటులో లేనందుకు క్షమించాలని , ఎన్నో అపురూప క్షణాలను తాను మిస్ అయ్యానని ఆమె పేర్కొన్నారు. ఇది నాకు చాలా కఠినమైన ప్రయాణమని.. కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, త్వరలోనే మీ ముందుకు వస్తానని నజ్రియా వెల్లడించారు. ఈ పోస్ట్‌కు స్టార్ హీరోయిన్ సమంత లవ్ ఎమోజీతో రిప్లయ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

ఈ పోస్ట్‌తో మలయాళ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. నజ్రియా నజీమ్‌కి ఏం జరిగింది? ఎందుకు ఇండస్ట్రీకి , అభిమానులకు దూరంగా ఉంటున్నారు? ఫహద్ ఫాజిల్‌తో నిజంగానే విడాకులకు సిద్ధమయ్యారా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే నజ్రీయా చేసిన నోట్‌పై నజ్రియా నజీం ఫహద్ అని రాయడంతో విడాకులు చోటు చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే బయటికి చెప్పలేదని ఏదో సమస్యతో ఆమె బాధపడుతున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే త్వరలోనే అది ఏంటనే దానిపై క్లారిటీ రానుంది. అప్పటి వరకు ఈ పుకార్లు కంటిన్యూ అవుతాయని విశ్లేషకులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X