పుష్ప లవర్స్‌కి షాకింగ్ న్యూస్, ఆయన లేకుండానే పుష్ప 3.?..సార్ లేకపోతే కష్టమే?

భారతదేశంలో ఫ్రాంచైజీలు, సీక్వెల్ సినిమాలకు ఆదరణ బాగా దక్కుతోంది. సౌత్ కంటే బాలీవుడ్‌లో ఇది బాగా క్లిక్ అవుతోంది. క్రిష్, ధూమ్, స్త్రీ , గదర్ వంటి సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక సౌత్ విషయానికి వస్తే బాహుబలి 2, కేజీఎఫ్, మునీ వంటి సీక్వెల్స్‌ బాగా హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరింది పుష్ప . మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప 1 దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, సీక్వెన్స్ అన్నింటికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

పుష్పకి సీక్వెల్‌గా పుష్ప 2ను తెరకెక్కించారు సుకుమార్. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు, అల్లు అర్జున్ గెటప్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమా తొలి రోజే రికార్డు స్థాయిలో రూ. 294 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇక 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1700 కోట్ల వసూళ్లు రాబట్టి రూ.2000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది.

Fahadh Faasil s Bhanwar Singh Shekhawat character not likely to be part of Pushpa 3

సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు పుష్ప ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా ఏర్పడిన బ్రాండ్ నేపథ్యంలో పుష్ప 3ని కూడా తెరకెక్కించాలని సుకుమార్ నిర్ణయించారు. దీనిలో భాగంగా పుష్ప 2 ఎండింగ్‌లో పార్ట్ 3 గురించి హింట్ ఇచ్చేశారు. అది కూడా షాకిచ్చేలా ఉంది. పుష్ప రాజ్‌ని తన అన్నయ్యలు కలుపుకోవడంతో పాటు ఇంటి పేరును కూడా ఇస్తారు. తన అన్న ఇంట్లో శుభకార్యానికి పుష్ప రాజ్ తన తల్లి, భార్యలతో కలిసి హాజరవుతాడు.

అందరూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడ కేంద్ర మంత్రి ప్రతాప్ రెడ్డి తన తమ్ముడు, తన తమ్ముడి కొడుక్కీ శ్రద్ధం పెడతాడు. ఈ కార్యక్రమానికి సిండికేట్ మొత్తం హాజరవుతుంది. అందరూ వచ్చారు కానీ వాడెక్కడ అని జగపదీ బాబు అడుగుతాడు. ఆ వెంటనే ముసుగు వేసుకున్న వ్యక్తి రిమోట్ స్విచ్ ఆన్ చేయగానే పుష్పరాజ్ వాళ్లు వెళ్లిన కళ్యాణ మంటపం మొత్తం పేలిపోతుంది. ఆ వెంటనే పుష్ప 3 అన్న టైటిల్ పడుతుంది.

Fahadh Faasil s Bhanwar Singh Shekhawat character not likely to be part of Pushpa 3

ఆ రిమోట్ వ్యక్తి ఎవరు? ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ చనిపోలేదా? లేదంటే మరో కొత్త వ్యక్తి విలన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అంటూ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప 3 గురించి పుష్ప 2కి సంబంధించి గతంలో రిలీజైన ఓ టీజర్‌లోనే కథ చెప్పేశాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయిన పుష్పరాజ్‌ను పోలీసులు, జగపతి బాబు మనుషులు వెంటాడతారని దీంతో అతను తప్పించుకుని అడవిలోకి వెళ్లిపోతాడని చెబుతున్నారు. అతని కోసం ప్రజలు టెన్షన్ పడుతుండగా అడవిలో పెట్టిన సీసీ కెమెరాలో పులి పక్కన పుష్ప కనిపించడంతో సంతోషిస్తారు.

అయితే ఫిలింగనర్‌లో వినిపిస్తున్న టాక్‌ను బట్టి .. పుష్ప 3లో భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ ఉండదట. పుష్ప 3లో నటించడానికి ఫాహద్ ఫాజిల్ అంతగా ఇష్టపడటం లేదట. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకుంటారని మలయాళ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అదే నిజమైతే పుష్ప 3లో మెయిన్ విలన్‌గా ఎవరు నటించనున్నారనేది ఆసక్తిగా మారింది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: pushpa 3 allu arjun fahadh faasil
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X