ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’.. ఆ వార్తలు అబద్ధం.. ఇదిగో క్లారిటీ
ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగ చిత్రం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ కూడా ఈసినిమాపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. లైనప్ లో ఎన్నో చిత్రాలు ఉన్నప్పటికీ సందీప్ సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మొన్నటి వరకు ఫుల్ గా అప్డేట్స్ అందిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ సినిమాను కాకుండా సందీప్ రెడ్డి వంగ మరో సినిమాకు వర్క్ చేస్తున్నారని ఇటీవల రూమర్లు తెగ వైరల్ అయ్యాయి. దానిపై తాజాగా నిర్మాత క్లారిటీ ఇచ్చారు.
ప్రభాస్ చివరి చిత్రాలు.. వాటి కలెక్షన్లు
బాహుబలి, సలార్, కల్కి వంటి చిత్రాల తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరింతగా బిజీ అయ్యారు. తన అప్ కమింగ్ చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా ఉన్నారు. చివరిగా డార్లింగ్ 'కల్కి 2898 ఏడీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయడం విశేషం. అంతుకు ముందు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'సలార్' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది.

సందీప్ రెడ్డి స్పిరిట్ ను పక్కన పెట్టారా?
సందీప్ రెడ్డి వంగ చివరిగా 'యానిమల్' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ఆ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది. అదే 'యానిమల్ పార్క్'. కాగా, ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ 'స్పిరిట్' చిత్రాన్ని పక్కన పెట్టి యానిమల్ పార్క్ షూటింగ్ పై దృష్టి పెట్టారని రీసెంట్ గా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ సందీప్ రెడ్డి మాత్రం ఎక్కడా ఆ విషయాన్ని కన్ఫమ్ చేయలేదు. నెక్ట్స్ 'స్పిరిట్'పైనే ఫోకస్ పెట్టినట్టు గత ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. కానీ ఇటీవల మాత్రం ఇలా ఫేక్ వార్తలు గట్టిగానే వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ 'స్పిరిట్' చిత్ర షూటింగ్ అప్డేట్..
స్పిరిట్ ఫేక్ వార్తలపై తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. స్పిరిట్ కంటే ముందే యానిమల్ పార్క్ తెరకెక్కనుందని వస్తున్న వార్తలు ఫేక్ అన్నారు. 2, 3 నెలల్లో షూటింగ్ ప్రారంభం కానుందని, ఆ తర్వాతనే సందీప్ రెడ్డి వంగా యానిమల్ పార్క్ పై దృష్టి పెడుతారని చెప్పారు. 2027లో స్పిరిట్ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే సందీప్ రెడ్డి ఇటలీ, మెక్సీకో వంటి దేశాల్లో లోకేషన్లను కూడా ఫైనల్ చేశారని తెలుస్తోంది.
ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా కండీషన్లు..
స్పిరిట్ చిత్ర షూటింగ్ ను సమ్మర్ తర్వాత ప్రారంభించేందుకు సందీప్ రెడ్డి వంగా సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయా పాత్రలకు సంబంధించిన కాస్టింగ్ ను కూడా పూర్తి చేసుకున్నట్టు సమాచారం. టాప్ టెక్నీషియన్లను కూడా ఎంపికచేశారంట. రూ.600 కోట్ల బడ్జెట్ తో సినిమా రూపుదిద్దుకోబోతోంది. మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్ సిక్స్ ప్యాక్ చూపించబోతున్నారని, స్టంట్స్ మొత్తం తనే డూల్ లేకుండా చేయనున్నారని సమాచారం. అలాగే ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఎక్కడా కనిపించకూడదని సందీప్ రెడ్డి కండీషన్ పెట్టారంట. అంతే కాదు సన్నగా తయారవ్వాలని ప్రాపర్ డైట్ మెయిటెయిన్ చేయాలని కండీషన్లు కూడా పెట్టారంట. మరోవైపు ప్రభాస్ నెక్ట్స్ 'రాజా సాబ్', 'ఫౌజీ' చిత్రాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.


Click it and Unblock the Notifications











