»   »  బోయపాటికి నాగార్జున 12 కోట్ల ఆఫర్: అసలు నిజం ఇదే....

బోయపాటికి నాగార్జున 12 కోట్ల ఆఫర్: అసలు నిజం ఇదే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరబాద్: ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించాలన్నా, భారీ వసూళ్లు సాధించే స్థాయికి వెళ్లాలన్నా ఆ హీరోకు మాస్ ఇమేజ్ ఉండాలి. అందుకే అలాంటి సినిమాలు తీసే దర్శకులకు డిమాండ్ బాగా ఎక్కువ.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందు నుండి మాస్ ఇమేజ్ పెద్దగా లేదనే చెప్పాలి. ఈతరంలో అయినా దాన్ని సొంతం చేసుకునేందుకు నాగార్జున ట్రై చేస్తున్నాడని, నాగ చైతన్యను మాస్ హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

బోయపాటితో సంప్రదింపులు

బోయపాటితో సంప్రదింపులు

ఇటీవలే అక్కినేని నాగచైతన్య 'రారండోయ్ వేడుకు చూద్దాం' సినిమాతో మంచి హిట్ కొట్టాడు. అభిమానులను అలరించే మాస్ సినిమా చేయాలని చైతూ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట. ఇందు కోసం తెలుగులో మంచి మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న బోయపాటితో సంప్రదింపులు జరుపుతున్నట్లు గాసిప్స్ గుప్పుమన్నాయి.

12 కోట్ల ఆఫర్

12 కోట్ల ఆఫర్

బోయాపాటి, నాగ చైతన్య కాంబినేషన్లో సినిమాను తెరకెక్కించడానికి అన్నపూర్ణ స్టూడియోస్ సిద్ధమైందని, ఈ సినిమా కోసం బోయపాటికి ఏకంగా రూ. 12 కోట్లు ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది.

అంత సీన్ ఉందా?

అంత సీన్ ఉందా?

కేవలం దర్శకుడికే రూ. 12 కోట్లు అంటే.... హీరో, హీరోయిన్, ఇతర ముఖ్య నటీనటుల రెమ్యూనరేషన్, సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ఇలా అన్ని కలిపితే సినిమా బడ్జెట్ తడిసి మోపెడు అవుతుంది. నాగ చైతన్యకు అంత భారీ బడ్జెట్ మోసేంత సీన్ ఉందా? అనేది కొందరి సందేహం.

అసలు నిజం ఇదీ...

అసలు నిజం ఇదీ...

ఈ వార్తలపై బోయపాటి ఓ టీవీ ఛానల్ లో స్పందించారు. అలాంటి బంపరాఫర్ ఏమీ రాలేదని ఆయన చెప్పారట. ప్రస్తుతం బోయాపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘జయ జానకి నాయకా' అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

నెక్ట్స్ చిరంజీవి 152వ మూవీ

నెక్ట్స్ చిరంజీవి 152వ మూవీ

ఈ సినిమా తర్వాత బోయపాటి చిరంజీవి హీరోగా తెరకెక్కే 152 సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు.

English summary
Nagarjuna offers Rs.12 Cr remuneration to Director Boyapati. This news is totally false.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu