ఇక ప్రభాస్ పనైపోయింది.. లాక్ డౌన్ దెబ్బకు ఇంట్లో పెళ్లి గోల?

రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ గురించి ఎన్ని నెగిటివ్ రూమర్స్ వచ్చినా వాటిని జనాలు ఎక్కువగా పట్టించుకోరు. అయితే రెబల్ స్టార్ పెళ్లి టాపిక్ మాత్రం అందరిలో హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి అనంతరం ప్రభాస్ మార్కెట్ తో పాటు పెళ్లిపై రూమర్స్ కూడా పెరిగాయి.

Recommended Video

Lockdown Leads To Prabhas Wedding || Actor Rana Comments
 అనుష్కతో లవ్ ట్రాక్..

అనుష్కతో లవ్ ట్రాక్..

ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నట్లు మిర్చి సినిమా వచ్చినప్పటి నుంచి రూమర్స్ వస్తున్నాయి. వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు బాలీవుడ్ లో కూడా అనేక కథనాలు రావడంతో అనుష్క, ప్రభాస్ ఇద్దరు కలిసి చాలా సార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ రూమర్స్ డోస్ ఏ మాత్రం తగ్గడం లేదు.

అదొక్కటే సమాధానం..

అదొక్కటే సమాధానం..

అనుష్క, ప్రభాస్ బాహుబలి సినిమాతో మరీంత దగ్గరయ్యారు అని ప్రముఖ నేషనల్ మీడియాలలో కూడా వార్తలు రావడం ఇద్దరి స్టార్స్ ని కాస్త తీవ్ర అసంతృప్తికి లోను చేసింది. ఆ మధ్య కాలంలో ప్రభాస్ ఒక స్ట్రాంగ్ ఆన్సర్ కూడా ఇచ్చాడు. రూమర్స్ ఆగలంటే.. మా ఇద్దరిలో ఎవరో ఒకరికి ముందు పెళ్లి కావాలని చెప్పాడు. ఆ దెబ్బతో ప్రభాస్ ఆలోచన విధానంపై అందరికి ఒక క్లారిటీ వచ్చింది.

 ఇంట్లో పెళ్లి గోల..

ఇంట్లో పెళ్లి గోల..

చాలా రోజుల తరువాత ప్రభాస్ లాక్ డౌన్ కారణంగా ఇంట్లో వాళ్లకు దొరికాడు. ప్రతిసారి షూటింగ్ వుందని పెళ్లి మ్యాటర్ నుంచి తప్పించుకుంటున్న ప్రభాస్ ఫైనల్ గా ఇంట్లో వాళ్లకు సమయం కేటాయిస్తున్నాడు. ఇంట్లో కృష్ణం రాజు ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు ప్రభాస్ పెళ్లి గురించి చర్చలు జరుపుతున్నారట. ఇప్పటికే 40లోకి వచ్చిన ప్రభాస్ మరో సల్మాన్ ఖాన్ అయిపోతాడేమో అని కుటుంబ సభ్యులతో పాటు మరో వైపు అభిమానులు కూడా కాస్త కంగారుపడుతున్నారు.

కృష్ణం రాజు చర్చలు..

కృష్ణం రాజు చర్చలు..

అసలైతే రెండేళ్ల క్రితమే బాహుబలి అయిపోగానే ప్రభాస్ కి పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ సాహూ సినిమాతో తప్పించుకున్నాడు. ఇంట్రెస్ట్ లేదని గత ఏడాది నుంచి పెళ్లి అంటేనే పారిపోతున్న ప్రభాస్ ఈ సారి తప్పించుకోవడానికి వీలు లేకుండా పెదనాన్న కృష్ణం రాజు ప్లాన్ చేశారట. ఈ ఏడాది కుటుంబ సబ్యులకు ఎదో ఒక నిర్ణయం చెప్పాలని పెళ్లి సంబంధాల గురించి సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు గాని ఈ ఏడాదిలోనే ప్రభాస్ పెళ్లి గురించి ఒక క్లారిటీ వచ్చేలా కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X