VD13: విజయ్ దేవరకొండకు ఊహించని టైటిల్స్.. ఎలాంటి హీరోకు ఏ పేర్లు పెడుతున్నారో!
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే టాలీవుడ్‌లోకి హీరోగా వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. హీరోగా పరియమైన కొత్తలోనే భారీ సక్సెస్‌లను ఖాతాలో వేసుకున్న అతడు.. తన రేంజ్‌ను ఒక్కసారిగా భారీ స్థాయిలో పెంచేసుకున్నాడు. ఈ జోష్‌లోనే గత ఏడాది 'లైగర్' అనే పాన్ ఇండియా చిత్రంతో వచ్చాడు. కానీ, ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస ప్రాజెక్టులతో సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'ఖుషి' అనే లవ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు.
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 'ఖుషి' మూవీ షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే.. తన 12వ సినిమాను 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు, ఆ వెంటనే అతడు తన 13వ చిత్రాన్ని పరశురాం పెట్ల దర్శకత్వంలో చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ ప్రాజెక్టును రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రారంభించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ - పరశురాం కాంబోలో రాబోతున్న ఈ చిత్రం కూడా కుటుంబ కథతోనే తెరకెక్కుతుందట. దీంతో ఈ సినిమాకు డీసెంట్ టైటిల్ పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే దీని కోసం నిర్మాత దిల్ రాజు రెండు పేర్లను ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించారని తెలిసింది. అందులో ఒకటి 'ఫ్యామిలీ స్టార్' కాగా.. మరొకటి 'కుటుంబరావు' అని తెలిసింది. ఈ రెండింటిలోనే ఒకటి ఫిక్స్ చేస్తారట. ఫుల్ యూత్ ఫాలోయింగ్ ఉన్న విజయ్‌కు ఈ రెండు టైటిళ్లూ కొత్తగానే ఉంటాయని చెప్పొచ్చు.
హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ డీసెంట్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. ఇది పూర్తైన వెంటనే షూట్ స్టార్ట్ చేస్తారని తెలిసింది.


Click it and Unblock the Notifications











