ప్రభాస్ పెళ్లి అప్పుడే జరగాల్సింది.. వాయిదాకు కారణం ఇదే, అమ్మాయిని వెతకడం!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మీడియాకు దూరంగా ఉండడానికి ఇష్టపడతాడు. ప్రభాస్ లో హంగులు, ఆర్భాటాలు ఎక్కువగా కనిపించవు. సింపుల్ గా తన పని తాను చేసుకుపోయే స్వభావం. కానీ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా వ్యక్తిగత అంశాలకు సంబందించిన వార్తలు మీడియాలో ఎక్కువగా వస్తున్నాయి. బాహుబలి పూర్తయినప్పటి నుంచి ప్రభాస్ వివాహానికి సంబందించిన వార్తలు మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రభాస్ 39వ జన్మదిన వేడుకలు జరిగిన సందర్భంగా మరో మారు ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర ప్రచారం మొదలయ్యింది.

పెరుగుతున్న వత్తిడి

పెరుగుతున్న వత్తిడి

వివాహం విషయంలో కుటుంబ సభ్యుల నుంచి ప్రభాస్ కు వత్తిడి పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి చేసుకోమని ప్రభాస్ తల్లి పట్టుబడుతోందట. దీనితో సాహో చిత్రం పూర్తి కాగానే పెళ్లి చేసుకుంటా అని ప్రభాస్ కుటుంబ సభ్యులకు మాట ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన ప్రభాస్ వివాహం వచ్చే ఏడాది జరగబోతోందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

Recommended Video

Shades Of Saaho Chapter 1 On Prabhas Birthday
అప్పుడే జరగాల్సింది

అప్పుడే జరగాల్సింది

వాస్తవానికి ప్రభాస్ బాహుబలి పూర్తయిన వెంటనే వివాహం చేసుకోవాలని భావించాడట. కానీ అదే సమయంలో సాహో లాంటి అతి పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఏ చిత్రంలో ప్రభాస్ సొంతంగా స్టంట్స్ చేస్తున్నాడు. సాహో చిత్రానికి ఎక్కువ సమయం వెచ్చించాలి. అందువలనే ప్రభాస్ తన పెళ్లి వ్యవహారాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

అమ్మాయిని వెతకడం ఎంతసేపు

అమ్మాయిని వెతకడం ఎంతసేపు

ప్రభాస్ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు. మంచి అమ్మాయిని వెతకడం ఎంత సేపు అని ఇదివరకే ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు తెలిపిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నర కాలంగా ప్రభాస్ వివాహం గురించి మీడియాలో అనేక రూమర్స్ వెలువడుతూనే ఉన్నాయి. ప్రభాస్ ఓ ఇంటివాడయ్యే ఘడియ వచ్చినప్పుడు ఆ రూమర్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పడుతుంది.

జాతీయ స్థాయిలో క్రేజ్

జాతీయ స్థాయిలో క్రేజ్

ప్రభాస్ బాహుబలి తరువాత ఇండియాలో క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది అనడం అతిశయోక్తి కాదు. సాహో చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇటీవల రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X