»   » పనిమనిషితో భర్త అక్రమ సంబంధం, హీరోయిన్ గోలెత్తిపోతోంది

పనిమనిషితో భర్త అక్రమ సంబంధం, హీరోయిన్ గోలెత్తిపోతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చిన్: కొన్ని వార్తలు వింటూంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెలబ్రెటీల జీవితంలో కూడా ఇలాంటివి తప్పదా అనిపిస్తుంది. అయితే చాలా సార్లు అవి నిజమే అని ప్రూవ్ అయ్యేసరికి షాక్ కు గురి అవుతాం. ముఖ్యంగా అక్రమ సంబంధం వంటి విషయాలు అయితే మరింత ఆసక్తిగా కూడా ఈ వార్తలోకి తొంగి చూడటం జరుగుతుంది.కాదంటారా. ఇప్పుడు అలాంటిదే ఒకటి మీకు అందించబోతున్నాం.

సాధారణంగా తెల్లారి లేస్తే పేపర్లలో,మీడియాలో భర్త అక్రమ సంభంధం, భార్య అక్రమ సంభంధం, వీటి పరిణామాలతో ఆత్మ హత్య, హత్య వంటివి చూస్తూంటాం. అయితే సెలబ్రెటీల జీవితాల్లో ఇలాంటివి ఉండవా అనే సందేహం కూడా అప్పుడప్పుడూ వస్తూంటుంది. కానీ అలాంటిదేమీ..మనుష్యులంతా ఒక్కటే అనే నినాదం..సెలబ్రెటీలది, వారి కుటుంబాలది అని అర్దమవుతుంది. ఈ వార్త మీరు చదవితే.

ఇప్పుడు మళయాళంలో ఓ స్టార్ హీరోయిన్ పరిస్దితి అలాగే ఉందిట. ఇదే విషయమై గత కొద్ది రోజులుగా మీడియా లో చర్చ జరుగుతోంది. ఆమె భర్త ఓ పనిమనిషిగా అక్రమ సంభందం పెట్టుకున్నారని చెప్పుకుంటున్నారు. దాంతో ఆ హీరోయిన్ కేవలం తన శ్రేయాబిలాషులకు చెప్పుకుని బాధపడుతోందిట. అందరూ హవ్వ అని నోర్లు నొక్కుకుంటున్నారు.

మనదేశంలో సినీతారల పట్ల ఉండే క్రేజ్‌ ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదంటే అతిశయోక్తి కాదు. అభిమాన నటీనటులను తెరవేల్పులుగా ఆరాధించడమూ ఇక్కడ వింత కాదు. తారలు కూడా తెరపైనే కాక వ్యక్తిగత జీవితంలోనూ హుందాగా వ్యవహరిస్తూ ఆదర్శంగా నిలవాలని అభిమానులందరూ కోరుకుంటారు. కానీ సినిమాల్లో నేరస్థుల ఆటకట్టించే హీరోలు నిజజీవితంలో నేరారోపణలకు, శిక్షలకు గురికావడం తరచూ జరుగుతున్నదే.

ఎవరేంటి

ఎవరేంటి

అయితే ఎవరా హీరోయన్ అని మాత్రం మీడియా ఎక్కడా ప్రస్తావించటం లేదు. అలాగే అక్కడ వెబ్ మీడియాలో ఈ వార్త దావానలంలా ప్రయాణిస్తోంది. దాంతో ఈ వార్తకు ఓ రేంజిలో ప్రయారిటీ వచ్చింది. ఆ అన్ నోన్ హీరోయిన్ మీద కథనాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.

ఇక్కడ కూడా

ఇక్కడ కూడా

అలాగే మరి ఈ వార్తకూ, మనకు లింకేంటి అంటారా..ఆ వార్తలో ఆ హీరోయిన్ ...తెలుగులో కూడా సినిమాలు చేసిందని రాసుకొస్తున్నారు. దాంతో ఎవరా హీరోయిన్, తెలుగులో చేసిందా..ఎప్పుడూ అని ఇక్కడ వాళ్లూ మాట్లాడుకుంటున్నారు.

ఇంకెకొకరు ని చూసి

ఇంకెకొకరు ని చూసి

ఈ వార్త ఇప్పుడు అందరివైపు అనుమానంగా చూసేలా చేస్తోందని కొందరు వాపోతున్నారు. సీనియర్ హీరోయిన్, ఆమె భర్త ఇలా అక్రమ సంభందం పెట్టుకున్నాడు అనగానే, పెళ్లైన సీనియర్ హీరోయిన్స్ అందరి వైపూ చూపు వెల్తోంది. ప్రతీవాళ్లు ...ఇంకొకరేమో అనుకునే పరిస్దితి ఏర్పడింది.

ఈ వార్త ఎక్కడ నుంచి

ఈ వార్త ఎక్కడ నుంచి

ఇక ఈ వార్త ..రీసెంట్ గా ఆ పనిమనిషిని హీరోయిన్ కడిగిపారేయటంతో బయిటకు వచ్చిందని చెప్పుకుంటున్నారు. అది అలా..అలా అందరికీ చేరిందని అంటున్నారు. అయితే ఆమె భర్త మాత్రం నీవన్ని అనుమానాలే..నేను నీ కళ్లకు ఎలా కనపడుతున్నాను అని మండిపడ్డాడట.

ఎంత గొడవైందంటే

ఎంత గొడవైందంటే

ఇక ఈ గొడవ ఎంత దాకా వెళ్లిదంటే...హీరోయిన్ తన భర్తతో గొడవ పడటం, విడాకులు తీసుకుందామనుకునేదాకా వెల్లిందట. దాంతో ఆమె భర్త ఈమె సంపాదనపై ఆధారపడటం చేస్తూండటంతో...సైలెంట్ అయ్యాడని చెప్తున్నారు.

తొలిగించటమే

తొలిగించటమే

ఇక వెంటనే ఆ హీరోయిన్ ఆ పనిమనిషిని తొలిగించిందని సమాచారం. దాంతో ఏ హీరోయిన్ ఇంట్లో పనిమనిషి మానేసిందో అని ఆరాతీస్తున్నారట. అలా ఈ అక్రమ సంభందం వార్త మంచి రంజుగా టీవీ సీరియల్ గా సాగుతోందని అంటున్నారు. పాఠకులు, ప్రేక్షకులు కూడా ఇలాంటి వాటిపై మంచి ఇంట్రస్ట్ చూపటంతో ఈ వార్తకు రెగ్యులర్ అప్ డేట్స్ ఇస్తున్నారు.

ఇదో క్లూ

ఇదో క్లూ

ఇక ఈ పెళ్లైన హీరోయిన్ కు ఈ మద్యకాలంలో ఆపర్స్ రావటం లేదని మరో క్లూ సైతం ఇచ్చారు. అంతేకాదు..హిందీ సినిమా సైతం ఒకటి చేసిందిట. అబ్బ పెద్ద పజిల్ లాగా ఉందంటారా..అవును...మరి ధ్రిల్లింగ్ సినిమాలకే కాదు మళయాళంలో థ్రిల్లింగ్ కథనాలుకు సైతం ఇంట్రస్ట్ ఎక్కువే.

ఈ టైమ్ లో ఈ రాసలీల

ఈ టైమ్ లో ఈ రాసలీల

ఇక ఈ గొడవ తోపాటు జనాలందిరికి ఓంపురి అక్రమ సంభందం విషయం గుర్తుకు వచ్చింది. 14 వ సంవత్సరంలోనే శాంతి అనే పనిపిల్లతో లైంగిక సంభంధం పెట్టుకున్నాడని,అలాగే లక్ష్మీ అనే పనిపిల్లతో ఆయన కొంతకాలం శృంగార కార్యక్రమాలు సాగించాడంటూ పద్మశ్రీ అవార్డు నటుడు ఓంపురిపై ఆయన భార్య రాసలీలల గుట్టు విప్పింది. 'అక్రోష్', 'అర్ధ్ సత్య', 'ఎ వెన్స్ డే' వంటి సినిమాలలో తన అసమాన నటనను పోషించి ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఆయనపై ఈ విధమైన వ్యాఖ్యానాలు వినపడటంతో అందరూ ఆశ్చర్యపడ్డారు.

భార్యే చెప్పేసింది

భార్యే చెప్పేసింది

ఓంపువరి భార్య నందిత ఇలా ప్రపంచానికి తన భర్త అక్రమ సంభందాల చిట్టా విప్పటంతో ఆయన ఇరుకున పడ్డారు. జర్నలిస్టు అయిన నందిత ఇటీవల 'అన్ లైక్లీ హీరో' అంటూ ఓంపురి జీవిత చరిత్ర రాశారు. ఇందులో ఆమె ఓంపురి 'రాసలీలలు' కూడా చెప్పుకొచ్చారు. ఓంపురి తన 14వ ఏట శాంతి అనే పనిమినిషితో లైంగిక సంబంధం పెట్టుకున్నారనీ, లక్ష్మి అనే మరో పనిపిల్లతోనూ ఆయన శృంగార కలాపాలు సాగించారనీ ఆమె ఇందులో పేర్కొన్నారు.

ఇలా చెప్పటమేంటని

ఇలా చెప్పటమేంటని

ఓంపురి జీవితంలో ఈ రెండు సంఘటనలు యాదృచ్ఛికంగా సంభవించినవే కావచ్చని అన్నారు. భర్త బలహీనతలను ఇలా పబ్లిక్ గా...అది కూడా 'బయోగ్రఫీ'లో చెప్పటం ఏమిటంటూ 64 ఏళ్ల ఓంపురి ఇప్పుడు ఆమెపై మండిపతున్నాడు. ఏదైమైనా నిజం కొంత కాలం దాగుతుంది కానీ ఎల్లకాలం దాచటం సాధ్యం కాదు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

లైంగిక వేధింపులనే

లైంగిక వేధింపులనే

ఇక షైనీ అహూజా అని ఓ బాలీవుడ్ హీరో ఉన్నాడు గుర్తుందా.. మాంచి రొమాంటిక్ సినిమాల్లోనే కనిపించి ఇతగాడికి ఈ మధ్య సినిమా ఛాన్సులు రావట్లేదు. ఇందుకు కారణం.. అప్పట్లో షైనీపై వచ్చిన వరుస ఆరోపణలే. లైంగికంగా వేధించాడంటూ సయాలీ భగత్.. ఆ తర్వాత పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణల కారణంగా కేసులో ఇరుక్కున్నాడు.

పనిమనిషిపై రేప్

పనిమనిషిపై రేప్

పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడని రుజువు కావడంతో, సినీ నటుడు షైనీ ఆహూజాకు ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తూ ముంబయి సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఫ్లాట్‌లో తామిద్దరమే ఉన్న సమయంలో అహూజా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ టీనేజ్ పనిమనిషి పోలీసు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. 2006లో విడుదలైన ‘హజారోం ఖ్వాయిషే ఐసీ' చిత్రంలో నటించిన అహూజా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

English summary
In film industry it is very usual to link up with heroines and heroes if their chemistry works in the films and they acted in more than two movies. We heard several rumors on Mollywood popular actresses and actors love affairs and also their secret dating gossips. Now a Famous actress' husband linked with servent lady
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu