వరుసగా 30 హిట్లు కొట్టేందుకు సిద్ధంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా?

2024 సంవత్సరం ప్రారంభం కాగానే చాలా మంది కొత్త కొత్త ఆశలు, ఆశయాలతో ముందుకెళ్తున్నారు. గతేడాది ఏం జరిగినా ఈ ఏడాదిలో మాత్రం స్టార్ లుగా ఎదిగిపోవాలని చూస్తున్నారు. అయితే అలాంటి వాళ్లలో ఎవరెవరు సక్సెస్ సాధిస్తారు, ఎవరెవరు సినిమాలకు దూరం అవుతారు, ఎవరెవరు జాతకాలు బాగున్నాయి అనే దానిపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్లు చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ ను ఏలబోయేది ఎవరు, ఏయే హీరోయిన్లకు ఆఫర్లు రావనే దాని గురించి వెల్లడించారు. అయితే ఈ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన క్యూట్ బ్యూటీ శ్రీలీల గురించి మాట్లాడుతూ చాలానే విషయాలు చెప్పారు వేణు స్వామి. ఆమె కెరియర్ పరంగా చాలా అద్భుతాలు సృష్టించబోతుందని ఆమె ఏ చిత్రంలో చేసిన అది సూపర్ డూపర్ హిట్టు అవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 2027వ సంవత్సరం వరకు ఆమెకు ఎదురు లేదని అన్నారు. శ్రీలీల చేయబోయే దాదాపు 30 సూపర్ డూపర్ హిట్లు అవుతాయని స్పష్టం చేశారు. ఇదే కనుక నిజం అయితే శ్రీలీలను కొట్టే వాళ్లే ఉండరేమో. ఈ ఏడాది అంతా ఆమె హవానే కొనసాగుతుంది.

Famous Astrologer VenuS wamy prediction on Tollywood Heroine Future Check Details

ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఇటీవలే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈమెకు ఇకపై నుంచి అవకాశాలు అంతగా రావని.. వచ్చినా అవి ఫ్లాప్ లుగా నిలుస్తాయని అన్నారు. 2024 నుంచి రష్మిక మందన్నా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని షాకింగ్ కామెంట్లు చేశారు. చూడాలి మరి నేషనల్ క్రష్ ఇదే హవాను కొనసాగిస్తూ.. హిట్లు కొడుతుందా లేక ఫ్లాప్ లకు సంతమై సినిమాలకు దూరం అవుతుందా అనేది.

Famous Astrologer VenuS wamy prediction on Tollywood Heroine Future Check Details

ఇక నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి కూడా చాలానే విషయాలు చెప్పుకొచ్చారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అద్భుతమైన సినిమాలు తీసి.. అందరూ మెచ్చే కథానాయికగా మారిన ఈమెకు కూడా సినిమా అవకాశాలు రావడం కష్టమే అని ఇక ముందు అంతగా అవకాశాలు దక్కించుకోలేదని పేర్కొన్నారు. సాయి పల్లవి కెరియర్ పరంగా కూడా డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని వెల్లడించారు. 2024 సంవత్సరం వచ్చిందో లేదో అందరి జాతకాల గురించి చెప్పేస్తున్నారు వేణు స్వామి. చూడాలా మరి ఇవన్నీ నిజంగానే జరుగుతాయా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X