ఖలేజా పై నోరు జారిన బాలయ్య పెదవి విరుస్తున్న అభిమానులు...!?
నందమూరి బాలకృష్ణ 'ఖలేజా" గురించి నాలుగు మంచి మాటలు చెప్పడం నేరమయిపోయింది. ఈ సినిమా నిన్న విడుదలైన విషయం తెలిసిందే. మొన్న సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో తన కుటుంబంతో సహా ఈ సినిమాని బాలయ్య వీక్షించాడు. అనంతరం, ఈ సినిమాలో మహీ ఎంతో బాగా చేశాడు. నేను సినిమాని బాగా ఎంజాయ్ చేసాను అని చెప్పాడు.
ప్రస్తుతం ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో సినిమా బాగుందంటూ మహేష్ ను బాలయ్య అభినందించడం పట్ల కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. బాగాలేని సినిమాని బాగుందని బాలయ్య ఎందుకు చెప్పాడు? అతనికి సినిమా చూడటం రాదా? అని విమర్శిస్తున్నారు. ఎప్పుడైనా సరే ఇతర హీరోల సినిమాలను మరో హీరో చూస్తే హీరో బాగా చేశాడనే చెబుతారు. నిజానికి ఈ సినిమాలో మహేష్ బాబు బాగానే యాక్ట్ చేసాడు. బాలయ్య ఆ మాటే చెప్పి సినిమాని ఎంజాయ్ చేసానని చెప్పాడు. ఇది ఆయన సంస్కారానికి నిదర్శనం. ఈ సంస్కారాన్ని వక్రీకరించి తమ కుసంస్కారాన్ని కొంతమంది బయట పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











