మహేష్ బాబు కనిపించలేదంటూ ఫ్యాన్స్ గోలగోల...
మహేష్ బాబు కనిపించుటలేదని ఫాన్స్ గోలగోల చేస్తున్నారు. తమ అభిమాన హీరో జాడలేక వారంతా అల్లడిపోతున్నారు. ఖలేజా విడుదలకి ముందు అభిమానులకి దగ్గరగా ఉండాలని ఓపెన్ చేసిన ట్విట్టర్ అకౌంట్ ని మహేష్ అస్సలు ఈ మధ్య ఓపెనె చేయడం లేదు. 'ఖలేజా" ప్లాప్ అవడాన్ని జీర్ణించుకోలేకపోయాడో, సినిమా ప్లాప్ అయినా దొంగ రికార్డులు చెప్పినందుకు మొహం చాటేశాడో కానీ మొత్తానికి మహేష్ బాబు కనిపించుట లేదు. చాలా రేర్ గా ట్విట్టర్ లో కనిపిస్తే ఫర్లేదు కానీ మహేష్ బాబు ఆమధ్య తరచుగా అక్కడే తచ్చాడేవాడు. ఒక్క సినిమా రిజల్ట్ రివర్స్ అయ్యేసరికి ఇలా ఫ్యాన్స్ తో కనెక్షన్ కట్ చేసేయడం మహేష్ బాబుకి తగదంటూ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











