యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రెండు ఫ్లాప్ లు సరిపోలేదేమో మళ్లీ అదే మిస్ ఫైర్....
'బొమ్మరిల్లు" తో దశ తిరిగిన తర్వాత జెనీలియా స్టార్ హీరోయిన్ అయిపోయింది. కానీ, అంతకుముందు వరుస ప్లాపులతో ఐరెన్ లెగ్ అని పిలిపించుకునే లెవల్ కి విసిగించింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ సరసన 'నా అల్లుడు", 'సాంబ" చిత్రల్లో నటించింది. 'నా అల్లుడు" ఎన్టీఆర్ సూపర్ ప్లాప్స్ లో ఒకటి కాగా, 'సాంబ" కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. ఎన్టీఆర్ తో జెనీలియా కాంబినేషన్ రెండు సార్లు మిస్ ఫైర్ అయినా మరోసారి అతడితో సినిమా చేసే అవకాశం జెనీలియాకు దక్కింది. ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఒక దాంట్లో జెనీలియా కథానాయికగా నటింస్తుందనేది లేటెస్ట్ న్యూస్.
బొమ్మరిల్లు తర్వాత బిజీ అయినా 'శశిరేఖా పరిణయం" దగ్గరకు వచ్చేసరికి జోరు కొట్టేసిన జెనీలియాకి మళ్లీ ఆమెను 'హసిని"తా తీర్చిదిద్దిన భాస్కర్ వల్ల 'ఆరెంజ్" లో నటించే ఛాన్స్ దక్కింది. మరెవరైనా ఫ్రెష్ హీరోయిన్ కోసం ట్రై చేద్దామని 'ఆరెంజ్" యూనిట్ లోని మిగతా కీలక సభ్యులు సూచించినా తన పాత్రకు జెనీలియా అయితేనే న్యాయం చేస్తుందని పట్టుబట్టి మరి ఆమెకు 'భాస్కర్" ఆరెంజ్ ఇచ్చాడు. ఆరెంజ్ లో జెన్నీ నటన గురించి బ్యాడ్ టాక్ వినిపిస్తున్నా కానీ తెలుగు చిత్ర పరిశ్రమకి మాత్రం ఆమె బోరుకొట్టట్లేదు. ఇప్పటికే ప్రేక్షకులకి జెనీలియా నటన చూసీ చూసీ విసుగొచ్చినా కానీ ఆమెతో నటించడానికి యంగ్ హీరోస్ ముచ్చట పడుతూనే వున్నారు. హిందీలో బిజీగా ఉన్నా దక్షిణాదిలో ఉన్న క్రేజ్ ని వేస్ట్ చేసుకోవడానికి జెనీలియా కూడా ఇష్టపడడం లేదు.


Click it and Unblock the Notifications











