twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ 'దూకుడు' మీద లక్షల్లో పందాలు

    By Srikanya
    |

    మహేష్ తాజా చిత్రం దూకుడు రేపు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అభిమానులు మధ్య బెట్స్ జోరందుకున్నాయి. ఎన్ని వారాలు ఆడుతుంది..ఏ రేంజిలో ఆడుతుందా..సినిమా హిట్టా..ఫట్టా వంటి అంశాలపై లక్షల్లో బెట్స్ కాస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఎక్కువగా మహేష్ ఫ్యాన్స్ మధ్యే జరుగుతూండటం విశేషం. ఇక దూకుడు సినిమా పోకిరి లాగానో, ఒక్కడు లాగానో ఉండాలని డిజైన్ చెయ్యలేదు. మంచి ఎమోషన్, కామిడీ ని కలిపి బ్లెండ్ చేస్తూ చెప్పిన ఒక కొడుకు కథ అంటున్నారు రచయిత గోపీ మోహన్. ఆయన ఈ చిత్రం గురించి తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో ఇలా ట్వీట్ చేసారు. అలాగే బేసిగ్గా నేను కృష్ణగారి అభిమానిని. కృష్ణగారు సాహసానికి మరో పేరని అంటుంటారు. ఈ సినిమాలో హీరో ఓ డైలాగ్ చెబుతాడు "మా నాన్నెప్పుడూ ఒకటంటుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దారితో పనిలేదు దమ్ముతోనే పని' అని". ఈ డైలాగ్ మంచి సందర్భంలో వస్తుంది. దాన్ని అందరూ కృష్ణగారితో ఐడెంటిఫై చేసుకుంటారు అంటున్నారు రైటర్ గోపీమోహన్. అలాగే ఇందులోని డైలాగుల్లో 'పోకిరి' షేడ్స్, 'రెడీ' షేడ్స్ రెండూ కనిపిస్తాయి. అయితే ప్రేక్షకులకి ఇది కావాలని చేసినట్లు ఏమాత్రం అనిపించదు. కథే బలంగా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీలవుతారు అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు. సెన్సార్ U/A సర్టిఫికేట్ తో క్లియరెన్స్ ఇచ్చింది.

    English summary
    The latest betting going on now is as to how many weeks the Dookudu film will run.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X