రాజమౌళి వర్సెస్ శంకర్ టాపిక్ హాట్ హాట్...
టాలీవుడ్ కి బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ ఎవరంటే నిస్సందేహంగా రాజమౌళికే అత్యధిక ఓట్లు పడతాయి. అలాగే సౌత్ ఇండియాకి..బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ పేరడిగితే శంకర్ పేరే ప్రతిధ్వనిస్తుంది. అయితే శంకర్ తో పోల్చి రాజమౌళిని తక్కువ చేయలేం. అయితే రాజమౌళి అభిమానులు తమ అభిమాన దర్శకుడే శంకర్ కన్నా గొప్పొ అని వాదిస్తున్నారు. శంకర్ తో పోలిస్తే రాజమౌళికి అంత సీన్ లేదని శంకర్ ఫాన్స్ తీసి పారేస్తున్నారు. రోబో" కి వచ్చిన టాక్ నేపథ్యంలో రాజమౌళి వర్సెస్ శంకర్ టాపిక్ హాట్ హాట్ డిస్కషన్స్ కి కారణమవుతోంది. 'మగధీర" వర్సెస్ 'రోబో"ల్లో ఏది బాగుందనే అంశం కూడా తెరమీదికొచ్చింది. ఈ రెండు సినిమాల సంగతి అటుంచితే దర్శకుడిగా ఎవరు బెస్ట్ అనే డిస్కషన్ లో ముఖ్యంగా వినిపిస్తున్న పాయింట్స్ ఏమిటో చూద్దాం.
రాజమౌళికి సుమారు నలభై కోట్ల బడ్జెట్ ఇస్తే 'మగధీర" వంటి సినిమాను రూపొందించాడని, అది విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో జాతీయ అవార్డు గెలుచుకున్న సంగతి గుర్తుంచుకోవాలని అతని ఫాన్స్ చెబుతున్నారు. అంతే కాదు శంకర్ కి ఇచ్చినట్టు నూట యాభైకోట్ల బడ్జెట్ నీ, రజనీకాంత్ నీ ఇస్తే రాజమౌళి ఒక అద్బుతాన్నే సష్టిస్తాడని గట్టిగా చెబుతున్నారు. రాజమౌళి మసాలా దర్శకుడని, శంకర్ సినిమాల్లో మంచి మెసేజ్ ఉంటుందనీ, ఇద్దరికీ పోలిక కాదు కదా..అంతరాల వ్యత్యాసం ఉన్నదని శంకర్ ఫాన్స్ అంటున్నారు. ఇదిలా వుంటే రోబో చూసి శంకర్ కి మాత్రమే ఇది సాధ్యమని కితాబిచ్చి రాజమౌళి డిస్కషన్ ని అక్కడితో ఎండ్ చేసేశాడు.
మరి ఇద్దరిలో ఎవరి గొప్ప వారిదే. శంకర్ ఎంత ట్రై చేసినా రాజమౌళిలా హీరోయిజాన్ని ఆ రేంజ్ లో ఎలివేట్ చేయలేడు. అలాగే కమర్షియల్ సినిమాలో సోషల్ అవేర్ నెస్ కి సంబంధించిన మెసేజ్ ని శంకర్ మాదిరిగా మరొకరు ఇంజెక్ట్ చేయలేరు. ఎవరికి వారు భిన్నమైన దర్శకులు కనుకే మనకు విభిన్నమైన సినిమాలు వీక్షించే వీలు చిక్కుతోంది. ఎవరికి వారు వారి వారి బలాలనే నమ్ముకుంటే చిత్ర సీమ వరుస బ్లాక్ బస్టర్లతో విరాజిల్లుతుంది.


Click it and Unblock the Notifications











