చిరంజీవి టంగ్ స్లిప్ అయ్యినందుకే ఈ తిప్పలన్నీ?
చిరంజీవి ఫ్యాన్స్ ఆయన సినిమాల్లోకి రావాలంటూ ధర్నా,ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ర్యాలీ వెనక పెద్ద కథే ఉందని వినపిస్తోంది. చిరంజీవి మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సినిమాల్లో నటించనన్నమాట టంగ్ స్లిప్ అయి వచ్చిందని తెలుస్తోంది. దాన్ని కవర్ చేసుకోలేక చిరంజీవి నానా పాట్లు పడుతున్నారని అంటున్నారు. అంతేగాక ఇప్పటికే చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ తో ఓ సినిమా చేయడానికి ఓకే అన్నట్లు తెలుస్తోంది. దాంతో రాంచరణ్ రెండ్రోజులుగా పెద్ద గొడవ చేశాడట. అందువల్ల తప్పని పరిస్థితుల్లో ఫ్యాన్స్ ని పిలిపించి వారి ద్వారా డ్రామా క్రియేట్ చేశారని చెప్తున్నారు. ఆ తర్వాత అభిమానుల కోరిక మేరకు ఒక్కసినిమాలో నటిస్తానని చిరంజీవి ప్రకటిస్తారట అదీ సంగతి.


Click it and Unblock the Notifications











