విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇచ్చిన సమంత.. అలా చీట్ చేసిందేంటని ఫ్యాన్స్ ఫుల్ ఫైర్
స్టార్ హీరోయిన్ సమంత.. సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇచ్చిందా? అంటే అవుననే ప్రచారం వినిపిస్తోంది. తన పని పూర్తవ్వగానే విజయ్ దేవరకొండను మధ్యలోనే వదిలేసి పక్కకు వెళ్లిపోయిందని చెబుతున్నారు. అసలు ఇంతకీ సమంత ఏం చేసింది? ఎందుకిలా ప్రచారం సాగుతుందనేది? ఇప్పుడు తెలుసుకుందాం.. వివరాళ్లోకి వెళితే..
ఆ రెండిటిపైనే ఆశలు..: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అప్పటివరకు కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. 'పుష్ప.. ఊ అంటావా' సాంగ్ తో ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడా ఫేమ్ ను కాపాడుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె చేసిన 'శాకుంతలం' భారీ డిజాస్టర్లను అందుకున్నాయి. అయినా ఈ అమ్మడు చేతిలో తెలుగులో 'ఖుషి', హిందీలో 'సిటాడెల్' వెబ్ సిరీస్ లు ఉన్నాయి. ఈ రెండిటిపైనే ఆమె భారీగా ఆశలు పెట్టుకుంది.

రిలీజ్ కు రెడీ..: అయితే సమంత గత కొద్ది కాలంగా మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యలో షూటింగ్ లకు కాస్త బ్రేక్ ఇచ్చి చికిత్స కూడా తీసుకుంది. కానీ ఆ తర్వాత ఆ వ్యాధి పూర్తిగా నయం కాకపోవడంతో ఇచ్చిన మాట కోసం తన షూటింగ్ లన్నింటినీ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమా చేసింది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైంది. రిలీజ్ కు రెడీ అయింది. సెప్టెంబరు 1న ఆడియెన్స్ ముందుకు రానుంది.

సడెన్ షాక్...:సినిమాకు రిలీజ్ కు రెడీ అయిన సమయంలో సమంత రీసెంట్ గా తాను ఏడాది పాటు బ్రేక్ తీసుకోబోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాకు కు గురి చేసింది. తన చికిత్స ను కొనసాగించేందుకు విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం అందింది. అయితే ఆమె 'ఖుషి' ప్రమోషన్స్ లో పాల్గొని, సినిమా రిలీజ్ అయ్యాక విదేశాలకు వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడామె ప్రమోషన్స్ లో పాల్గొననని మూవీటీమ్ కు చెప్పిందట. మొత్తం బాధ్యత విజయ్ దేవరకొండనే చూసుకోవాలని సూచించిందట.

సమంత చీట్ చేసిందంటూ...: ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు.. 'విజయ్ ఒక్కడే ప్రమోషన్స్ ను ఎంతవరకు నెట్టుకొస్తాడు?. అసలే ఆయన నటించిన లైగర్ కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇలాంటి సమయంలో విజయ్ ను ఒక్కడినే వదిలేయడం ఎంత వరకు కరెక్ట్? అంతకుముందు కూడా 'ఖుషి' షూటింగ్ సమయంలో సమంత బ్రేక్ తీసుకుంటే.. ఆమె కోసం విజయ్ ఓపికతో ఉన్నారు. కనీసం ఈ సంగతిని గుర్తుపెట్టుకుని.. సమంత కాస్త ప్రమోషన్స్ లో విజయ్ కు హెల్ప్ గా ఉంటే బాగుండేది. ఏదేమైనా ఇలా చేయడం కరెక్ట్ కాద'ని అంటున్నారు. అలా మధ్యలోనే హ్యాండ్ ఇచ్చిన వెళ్లడం సరికాదని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











