'గబ్బర్ సింగ్ 'రికార్డులపై ఓపెన్ ఛాలెంజ్?
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ విడుదలై మెగా హిట్ కొట్టి సునామీ తరహాలో కలెక్షన్స్ కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కలెక్షన్స్ ని అఫీషియల్ గా ప్రకటిస్తారని, రికార్డుల ప్రసక్తి వస్తుందని అందరూ ఆశించారు. అయితే పవన్ కళ్యాణ్ కి ఈ విషయమై గట్టిగా చెప్పి ఉండటంతో ఎక్కడా కలెక్షన్స్ ని నిర్మాత ప్రకటించటం లేదు. కానీ మిగతా హీరోల ఫ్యాన్స్ మాత్రం ఊరుకోవటం లేదు. వాళ్ల హీరో రికార్డులను ప్రస్దావిస్తూ ఓపెన్ ఛాలెంజ్ లు విసురుతున్నారు.
ఈ ఓపెన్ ఛాలెంజ్ లకు వేదిక ఫేస్ బుక్, బ్లాగ్ లు అవుతున్నాయి. మగధీర,దూకుడు కలెక్షన్స్ విషయంలో అప్పుడు పెద్ద గొడవ జరిగింది. అయితే మగధీర హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా మంది పవన్ ఫ్యాన్స్ కూడా కావటంతో వారు సైలెంట్ గా ఉంటున్నారు. కాని కొందరు మహేష్ ఫ్యాన్స్ మాత్రం దూకుడు కలెక్షన్స్ ని గబ్బర్ సింగ్ తో పోల్చి ప్రస్దావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఖచ్చితంగా పోల్చటానికి గబ్బర్ సింగ్ అఫీషియల్ కలెక్షన్స్ అందుబాటులో లేకుండా పోయాయి. అది ఓ సమస్యగా మారింది.
అయితే కొందరు మాత్రం గబ్బర్ సింగ్ కలెక్షన్స్, రికార్డులను పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదని, అది రీమేక్ అని కొట్టి పారేస్తున్నారు. రీమేక్ అయినా మరొకటి అయినా హీరో సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టి రికార్డుల క్రియేట్ చేయటం మెయిన్ అని అంటున్నారు. ఇక పవన్ మాత్రం ఈ వివాదాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. తన నిర్మాత గణేష్ ని పిలిచి..ఎక్కడా కలెక్షన్స్ విషయం ప్రస్దావించవద్దని చెప్పినట్లు సమాచారం. నా ఫ్యాన్స్ హ్యాపీగ ఉన్నారు. అంతకు మించి కావాల్సింది ఏముంది అని చెప్పినట్లు తెలుస్తోంది.
కొన్ని మీడియా వర్గాలు మాత్రం తమకు అందుబాటులో ఉన్న సోర్స్ ద్వారా డిస్ట్రిబ్యూటర్స్ ని ఎంక్వైరీ చేసి మరీ గబ్బర్ సింగ్ భాక్సాఫీస్ కలెక్షన్స్ ని చెప్తున్నాయి. ఏదైమైనా హీరో భాధ్యాతాయుతంగా కలెక్షన్స్ పై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విభేదించుకోవటం ఇష్టం లేక ప్రకటించవద్దనటం మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరక్ట్ చేసారు.


Click it and Unblock the Notifications











