బాలయ్య 100వ సినిమాపై అభిమానుల్లో అసంతృప్తి!

By Bojja Kumar

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించబోయే 100 చిత్రాన్ని 'శ్రీరామ రాజ్యం' నిర్మాత యలమంచిలి సాయి బాబు నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విజయనగర సామ్యాన్ని ఏలిన చక్రవర్తికి సంబంధించిన ఇతివృత్తంతో ఈ చిత్రం సాగనుందట. ఇప్పటికే శ్రీరామ రాజ్యం లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసిన సాయిబాబు...మనీ పరంగా ఆ సినిమా ద్వారా తనకు పూర్తి సాయి సంతృప్తి కలుగక పోయినా, మరోసారి బాలయ్యతో సాహసోపేత సినిమాకు శ్రీకారం చుట్టడంపై అభిమానుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.

అయితే ఈచిత్రానికి సంబంధించిన కథాంశంపై బాలయ్య అభిమానులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మిడిమిడి జ్ఞానంతో రచయితలు ఈ స్టోరీని సిద్దం చేస్తున్నారని, దీని వల్ల సినిమాపై ఎఫెక్టు పడే అవకాశం ఉందని అంటున్నారు. అసలు విజయనరగ సామ్యాజ్యం ఎప్పుడు విస్తరించింది, ఎప్పుడు వర్ధిల్లింది అనే కనీస జ్ఞానం రచయితలకు లేదని, 1300 AD నుంచి 17000 AD వరకు విజయనగర చక్రవర్తులు పాలిస్తే... 1300 to 1700 BC వరకు పాలించినట్లు వాళ్లు కథ అల్లారని, AD(After the Death of Jesus), BC (Before Christ) తేడా తెలియని వాళ్లు ఆ సినిమా కథను పర్‌ఫెక్టుగా తీర్చిదిద్దుతారనే నమ్మకం లేదంటున్నారు.

రచయితలు తప్పుడు తడకలుగా స్టోరీ రాస్తున్నారనే విషయం అభిమానులకు ఎలా తెలిసిందో కానీ....ఇప్పుడు ఈ విషయం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య రవి చావాలి దర్శకత్వంలో 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటిస్తున్నారు. బాలయ్య సరసన పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లగా నటిస్తున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత రమేష్‌ పుప్పాల ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక బాలయ్య అతిథి పాత్ర పోషిస్తున్న 'ఊకొడతారా ఉలక్కి పడతారా' చిత్రం జులై 2వ వారంలో విడుదలకు సిద్ధం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X