నా బోయ్ ఫ్రెండ్ అతను కాదు....

కాని బొద్దుగా, ముద్దుగా ఉండే ఫర్జానా మాత్రం తను అల్లరి నరేష్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్త విని షాకయ్యానని చెప్తోందిట.
నరేష్‌తో తనకు ఎలాంటి అఫైర్ లేదని, అతను తన సహ నటుడు మాత్రమే అని ఫర్జానా స్పష్టం చేసింది. గుమ్మడికాయల దొంగ అనే సామెత గుర్తుచేసుకోకుంటే...నిజమే అనిపించే అమాయకత్వంతో చెప్పింది. దాంతో ఫర్జానా, నరేష్‌ల మధ్య అఫైర్ ఉందన్న పుకార్లకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ఈలోగా ఫర్జానాకు బోయ్‌ఫ్రెండ్ ఉన్నమాట నిజమేనని అతను షూటింగులకు కూడా వస్తుంటాడని మళ్లీ స్పీడుగా పరిశ్రమలో గుసగుసలు బయలుదేరాయి.
కానీ ఈసారి మీరు విన్న గుసుగుసలు మాత్రం నిజమేనంటూ ఫర్జానా కన్ ఫర్మ్ చేస్తోందిట. అవును నాకు బోయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అయితే అతను సినిమారంగాని చెందినవాడు కాదని ... ఓ వ్యాపారవేత్త అని ఫర్జానా వివరిస్తోందిట. ప్రస్తుతానికి తాము లవర్స్ గానే కొనసాగుతున్నామని మరో మూడేళ్ల దాకా పెళ్లి గొడవే లేదంటోంది. ఇది విన్న వారు మాత్రం నరేష్ ని ఉడికించటానికే ఆమె ఇలాంటి కబుర్లు చెపుతోందని తోసిపడేస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా బాలీవుడ్ మాదిరిగా ఎప్పుడూ మీడియో నోట్లో మంచిగానో చెడుగానో నానితే ఆఫర్స్ కి లోటుండదనేది ఓ డిఫెరెంట్ స్టాటజీ.అదే ఫర్జానా ఫాలో చేస్తోందేమో!


Click it and Unblock the Notifications











