twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యో ఫర్జానాని తొక్కేసారా?

    By Staff
    |

    Farzana
    హఠాత్తుగా హీరోయిన్ ఫర్జానా కనపడటం మానేసింది. ఏమైపోయింది. రకరకాల రూమర్స్ వస్తున్నాయి..అంటూ ఎంక్వైరీ చేసిన వారికి తెలిసిన కొన్ని నిజాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఓ పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను తెలుగు పరిశ్రమలో లేకుండా చేసారని వినపడుతోంది. ఎవరు చేసేరనేది ఫిల్మ్ నగర్ లో అందరికీ తెలిసిన విషయమే అయినా అయ్యో అనటానికి కూడా ధైర్యం చేయలేని స్ధితిలో ఉన్నారు.

    చక్కని ఫేస్ కట్ తో,ఈజీగా చేసే డాన్స్ మూవ్ మెంట్స్ తో తెలుగు అమ్మాయిలా కలిసిపోయిన ఆమె భాగ్యలక్ష్మి బంపర్ డ్రా సినిమాతో తెరంగ్రేటం చేసింది. తర్వాత అల్లరి నరేష్ తో కలిసి చందనా బ్రదర్స్,సీమశాస్త్రి వంటి చిత్రాలు చేసింది. తర్వాత శ్రీనివాస రెడ్డి కాంప్ కే పరిమితమైపోయినట్లు ఆమె అక్కడే ఆఫర్స్ సంపాదించుకుంది. మిగతావాళ్ళు ఎంకరేజ్ చేద్దామనుకున్నా..ఆమె పర్శనల్ లైఫ్ కి ముడిపడ్డ ఓ హీరో తండ్రి తన పరపతిని ఉపయోగించి ఆమెను హైదరాబాద్ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేయటంతో ఎక్కడా తర్వాత అవకాశాలు రాలేదు.

    అంతేగాక ఆమె అబార్షన్ చేయించుకుంది..ఒళ్ళు తగ్గించుకోవటానికి హాస్పటిల్ లో చేరింది.నడుంనొప్పి ఆపరేషన్ చేయించుకుంది అంటూ రూమర్స్ సైతం పుట్టించారు. తన కుటుంబం బాగుంటే చాలనుకుని మిగతా వాళ్ళుపై లేనిపోని అభాంఢాలు వేయిటం చాలా దారుణమని అంతా అంటున్నారు. బ్యాడ్ కదా. అయితే ఫర్జానా మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఎలాంటి పాత్రయినా చేస్తానంటూ ముందుకొస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X