ఫర్జానా కొత్త కోరిక

అందులోనూ ఈ మధ్య గజిబిజి సినిమాలో బాగా లావెక్కిందనే సంగతి ఆమే గ్రహించిందిట. ఇదేమన్నా తమిళమా ...బొద్దుగా ఉంటే మెచ్చుకోవటానికి అని కావాల్సినవారందరూ మందలించటంతో ఈ నిర్ణయానికి వచ్చిందిట. ముందు కొంత కాలం సినిమా షూటింగ్ లకు సెలవు పెట్టి కేరళ వెళ్ధామని అనుకుందిట. అక్కడ ఆరోమా ట్రీట్ మెంట్ ,మసాజ్ ట్రీట్ మెంట్ తీసుకుని ఒళ్ళు అలవకుండా తగ్గిద్దామని డిసైడ్ అయిందిట.అయితే ఈ వెయిట్ రిడక్షన్ స్కీమ్ ని ప్రసాద్ అనే వ్యక్తి సారద్యంలో తీసుకుంటే బాగుంటుందని బాగా దగ్గరవారు సలహా ఇచ్చారట. ఆయన ఇప్పటికే చాలామంది టాలీవుడ్ ప్రముఖులకు గైడెన్స్ ఇస్తున్నారుట.
హాట్ తార నయనతార కూడా ఈయన గైడెన్స్ లోనే శరీరాన్ని స్లిమ్ గా ఉంచుకుంటోదిట. విశాల్ కూడా సిక్స్ పాక్ బాడీ నీ ఈయన్ని సంప్రదించే సంపాదించాడుట. దాంతో ఫర్జానా కూడా ప్రసాద్ ని సంప్రదిస్తే తన బాడీ షేప్ అధ్బుతంగా మారుతుందని ఆశిస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్జానా


Click it and Unblock the Notifications











