ప్రభాస్ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్.. ఆ పేరునే ఎందుకు పెట్టారంటే!
పేరుకు తెలుగు హీరోనే అయినా దేశ వ్యాప్తంగా మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుని పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతోన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఎప్పుడైతే 'బాహుబలి' మూవీ చేశాడో.. అప్పటి నుంచి సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా అతడి రేంజ్ పెరుగుతూనే ఉంది. దీంతో ఈ బడా హీరో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా మూవీలు చేస్తున్నాడు.
రెబెల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్' మూవీతో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఉప్పుడు అతడు 'కల్కి ఏడి 2898' సినిమాలో నటిస్తున్నాడు. ఇది మరికొద్ది రోజుల్లోనే విడుదల కాబోతుంది. అలాగే, దీని తర్వాత ప్రభాస్ 'ది రాజా సాబ్', 'సలార్ 2', 'స్పిరిట్' మూవీలను చేయనున్నాడు. ఇవి కాకుండా అతడు మరో ప్రాజెక్టునూ ఓకే చేశాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. 'సీతా రామం' దర్శకుడు హను రాఘవపూడితో కూడా త్వరలోనే ఓ మూవీని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ సినిమా వరల్డ్ వార్ నేపథ్యంతో సాగే ఓ స్వచ్చమైన ప్రేమ కథతో రూపొందనుందని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది. దీంతో అధికారికంగా ప్రకటించక ముందే ఈ ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది.
ప్రభాస్ - హను రాఘవపూడి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాకుండానే దీని గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు వివరాలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో అంశాలు తెరపైకి వచ్చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ - హను మూవీ టైటిల్ ఫిలిం నగర్ ఏరియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ప్రభాస్ కొత్త సినిమాకు 'ఫౌజీ' (FAUJI) అనే పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే దీన్ని నిర్మాతలు ఫిలిం చాంబర్‌లో కూడా రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ఇక, ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఇది వార్‌కు సంబంధించిన మూవీ కావడం వల్లే ఈ టైటిల్ పెట్టారని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోతోన్నాయి.
ఇదిలా ఉండగా.. ప్రభాస్, హను కాంబోలో రాబోతున్న ఈ క్రేజీ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించబోతున్నారు. దీన్ని కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే చాలా భాషల్లో రూపొందిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని వచ్చే డిసెంబర్ నుంచి మొదలు పెట్టే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











