ప్రభాస్‌తో FCUK బ్యూటీ: బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ హీరోయిన్
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. కానీ, వారిలో అతి తక్కువ మంది మాత్రమే తమ రేంజ్‌తో పాటు టాలీవుడ్ సత్తాను కూడా పెంచుతున్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ తెలుగు చిత్రాలకు పరిమితం అయిన అతడు.. 'బాహుబలి' తర్వాత నుంచి దేశ వ్యాప్తంగా మార్కెట్‌ను పెంచుకుంటూ పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు వరుసగా 'సలార్ 2', 'Kalki 2898 AD', 'స్పిరిట్'తో పాటు మారుతితోనూ ఓ సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే.
ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న సినిమా హర్రర్ కామెడీతో రాబోతుందని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా ఎంతో సీక్రెట్‌గా సాగుతోంది. ఇందుకోసం ఓ బూత్ బంగ్లా సెట్‌ను నిర్మించి, అందులో చిత్రీకరణ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే దాదాపుగా 40 శాతానికి పైగా టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకునేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
Recommended Video


ప్రభాస్ - మారుతి కాంబోలో హర్రర్ కామెడీ మూవీగా రాబోతున్న ఈ సినిమా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ పాత్రల కోసం హాట్ బ్యూటీలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌ను ఎంపిక చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మూడో హీరోయిన్‌ను కూడా సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ రోల్‌ను కుర్ర హీరోయిన్ అమ్ము అభిరామి చేస్తోందట. ఇప్పటికే ఈమె ఈ షూట్‌లో కూడా పాల్గొందని తెలుస్తోంది.
తమిళనాడుకు చెందిన అమ్ము అభిరామి అక్కడ ఎన్నో సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'రాక్షసుడు' మూవీతో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 'FCUK', 'నారప్ప', 'రణస్థలి', 'డెవిల్' మూవీల్లో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ సినిమాకూ ఎంపికైనట్లు తెలుస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి 'రాయల్', 'వింటేజ్ కింగ్', 'అంబాసీడర్', 'రాజా డీలక్స్' వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











