ఫిబ్రవరి 15 నుంచి పవన్ లాఠీఛార్జీ

By Srikanya

హైదరాబాద్: ఎప్పుడెప్పుడెప్పుడా అని పవన్ అభిమానులు ఎదురుచూసిన గోపాల గోపాల చిత్రం వచ్చింది..వెళ్లింది. సోసోగా ఉన్న ఈ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపధ్యంలో ఆయన కొత్త చిత్రం అదీ గబ్బర్ సింగ్ 2 కోసం అభిమానులు ఎదురూచడటంలో వింత లేదు. పవర్ దర్శకుడు రవీంద్ర(బాబి)తో ఈ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్ పవన్ ఈ మేరకు స్క్రిప్టు వర్క్ పూర్తి చేసినట్లు సమాచారం.

ఫిబ్రవరి 15 నుంచి ఈ చిత్రం షూటంగ్ రెగ్యులర్ గా జరగనుందని తెలుస్తోంది. అప్పటి నుంచి పవన్ ఓ రేంజి ఎనర్జీతో పోలీస్ పాత్రలో నిమగ్నమవుతారని అంటున్నారు. దానికితోడు ఈ చిత్రంలో లాఠీ ఛార్జీ సన్నివేశాలు సైతం ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అవి సినిమాకు హైలెట్ గా నిలుస్తాయిని చెప్పుకుంటున్నారు. స్పీడుగా చిత్రాన్ని ఫినిష్ చేసి ఆగస్టు రెండో వారంలో విడుదల చెయ్యాలని పవన్ ...యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు చెప్తున్నారు.

పవన్ కళ్యాణ్ త్వరలో ‘గబ్బర్ సింగ్-2' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈచిత్రం ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. అనేకానేక కారణాలతో సినిమా ఇప్పటికీ పట్టాలెక్కలేదు. తాజా పరిస్థితి పరిశీలిస్తే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిచబోతున్నారు. ‘గోపాల గోపాల' విడుదల కావడంతో కాస్త ఫ్రీ అయిన పవన్ కళ్యాణ్....పర్సనల్‌గా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారు.

February 15th - Pawan Sets The Date

ఆ మధ్య పవన్ కళ్యాణ్‌కు బ్యాక్ పోయిన్ ఉందని, శస్త్ర చికిత్స కోసం ఆస్ట్రేలియా వెలుతున్నారనే వార్తలు మీడియాలో హల్ చల్ చేసాయి. అయితే రూమర్స్ విన్న పవన్ కళ్యాణ్ నవ్వారట. అలాంటిదేమీ లేదు...నేను షూటింగుకు రెడీగా ఉన్నానని దర్శక నిర్మాతలతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించనున్నారు. తొలి షెడ్యూల్ లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందట.

అలియాస్ జానకి చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన అనీషా ఆంబ్రోస్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది. 'పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తాడని తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. ఆయన ఐడియాలజీ సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి.

గబ్బర్ సింగ్-2 చిత్రం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ చిత్రాలకుతో సంబంధం లేకుండా సరికొత్త కథతో ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అంత్యాక్షరి గ్యాంగ్ కూడా ‘గబ్బర్ సింగ్-2'లో కూడా నటించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X