కత్రినా కైఫ్ - రణబీర్ కపూర్ పెళ్లికి రూట్ క్లియర్...?(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇండియాలో మీడియా కారణంగా ఎక్కడా ఏకాంతంగా గడిపే పరిస్థితి లేక పోవడంతో తరచూ విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తున్నారు.
త్వరలో ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి ఇటు రణబీర్ ఫ్యామిలీతో పాటు అటు కత్రినా ఫ్యామిలీ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. తొలుత రణబీర్ తండ్రి రిషి కపూర్ కాస్త అభ్యంతరం తెలిపినా తర్వాత కొడుకు కోరికను కాదనలేక పోయారట. అన్నీ ఓకే అయితే 2015 ఫిబ్రవరి కల్లా వీరి వివాహ మహోత్సవం జరుగొచ్చని అంటున్నారు.
వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్. స్లైడ్ షోలో కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ లకు సంబంధించిన ఫోటోలు

రణబీర్-కత్రినా
రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఇద్దరూ ఒకరికొకరు సరి జోడీ అనే పేరు తెచ్చుకున్నారు.

అప్పుడే ప్రేమలో...
రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ తొలిసారిగా 2009లో ‘అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ' చిత్రంలో కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు.

దగ్గరయ్యారు...
ఆ వెంటనే ఈ ఇద్దరూ ‘రాజ్ నీతి' అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలో ఇద్దరూ మరింత దగ్గరయ్యారు.

డేటింగులు, చాటింగులు...
ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిన తర్వాత వీరి మధ్య డేటింగులు, చాటింగులు పెరిగిపోయాయి.

విదేశాల్లో...
ఇండియాలో మీడియా గోల ఎక్కువ కావడంతో తరచూ విదేశాలకు వెళ్లి లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేసి వస్తున్నారు.

పెద్దల అంగీకారంతో పెళ్లి..
దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం ఇద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్దమవుతున్నారు.


Click it and Unblock the Notifications











