ఫిబ్రవరి 10న హాట్ హీరోయిన్ ఎంగేజ్‌మెంట్?

By Bojja Kumar

February engagement for Kareena?
బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్ - సైఫ్ అలీఖాన్ లవ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు కూడా. వీళ్ల పెళ్లిపై గత కొన్నిరోజులుగా రకరకాల ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఫిబ్రవరి 10న ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అయిందని అంటున్నారు. అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ బయటకు రాలేదు. ఫిబ్రవరి 10న కరీనా-ఇమ్రాన్ ఖాన్ కలిసి నటించిన 'ఏక్ మెయిన్ ఔర్ ఏక్ తు' సినిమా విడుదలవుతుండటం గమనార్హం.

గత కొన్ని రోజుల క్రితం కరీనా కపూర్ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ...''మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్న మాట వాస్తవమే. అయితే మేము ఇప్పటికే పలు సినిమాలకు కమిట్ అయినందున ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. ప్రస్తుతం నేను ఏజెంట్ వినోద్ చిత్రంతో పాటు, హీరోయిన్ చిత్రంలో నటిస్తున్నాను, సరైన సమయం వచ్చాక పెళ్లి ముహూర్థం ఖరారు చేసుకుంటాం'' అని చెప్పింది. తన పెళ్లికి రీతు కుమార్ దుస్తులను డిజైన్ చేస్తున్నారనే వార్తలను నిజం కాదంటూ కరీనా తోసి పుచ్చింది. మీడియా వాళ్లు మమ్మల్ని కలిసినప్పుడల్లా పెళ్లి గురించే అడుగుతున్నారే తప్ప మేము చేస్తున్న సినిమల గురించి పట్టించుకోడం లేదంటూ కరీనా అసంతృప్తి వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X