దీపిక ఒక్కరే కాదు.. అల్లు అర్జున్ ‘రాకా'లో మరో స్టార్ బ్యూటీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'రాకా'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ పోస్టర్లు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీయగా.. తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ఓ మలయాళ బ్యూటీ నటించబోతుందట.ఈ విషయాన్ని ఆ అమ్మడు స్వయంగా ప్రకటించడంతో 'రాకా' మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరు?

ఆ బ్యూటీ ఎవరో కాదు.. నటి ఫెమినా జార్జ్ .. 'మిన్నల్ మురళి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఫెమినా జార్జ్. ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న నటీమణుల్లో ఒకరు. తాజాగా తన కొత్త సినిమా 'కరక్కం' ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడుతూ.. 'రాకా'లో తాను నటిస్తున్న విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, అల్లు అర్జున్‌తో కలిసి నటించే అవకాశం రావడం తనకు కల నిజమైనట్టుగా అనిపించిందని భావోద్వేగంగా చెప్పింది.

Femina George Joins Allu Arjun s Raaka Adds More Buzz to Atlee s Pan-World Epic

ఫెమినా మాటల్లో చెప్పాలంటే.. 'రాకా' తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటికంటే పెద్ద ప్రాజెక్ట్. 'నేను చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ అభిమానిని. ఆయన నటించిన 'హ్యాపీ' సినిమా చూసినప్పటి నుంచి ఆయనపై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఇప్పుడు అదే హీరోతో ఒకే స్క్రీన్‌లో కనిపించబోతున్నానంటే ఇంకా నమ్మలేకపోతున్నాను' అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. 'డిస్కో' సినిమా షూటింగ్ పూర్తి చేసిన కొద్దిరోజులకే 'రాకా' టీమ్ నుంచి ఫోన్ వచ్చిందని, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తన జీవితంలో మరచిపోలేని అనుభవమని చెప్పింది.

ఫెమినా పాత్ర నిడివి పెద్దది కాకపోయినా.. కథలో కీలక మలుపు తీసుకొచ్చే క్యారెక్టర్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అట్లీ సినిమాల్లో చిన్న పాత్రలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఫెమినా పాత్ర కూడా కథలో కీలకంగా ఉండే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో ఒకరికి పైగా హీరోయిన్లు ఉంటారనే ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఫెమినా ఎంట్రీతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

'రాకా' గురించి వినిపిస్తున్న మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఇది కేవలం సాధారణ యాక్షన్ సినిమా కాదట. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, మైథాలజీ అంశాల కలయికగా రూపొందుతున్న విజువల్ వండర్ అని చెబుతున్నారు. అల్లు అర్జున్ ఇందులో పలు గెటప్స్‌లో కనిపించనున్నారని, ఒక ప్రత్యేకమైన యోధుడి పాత్రలో నటిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఫస్ట్ లుక్‌లో కనిపించిన తోడేలు పంజా, గుండు లుక్, రఫ్ మేకోవర్ ఇప్పటికే అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచాయి.

సోషల్ మీడియాలో మరో ఆసక్తికర థియరీ కూడా వైరల్ అవుతోంది. 'రాకా' అంటే పౌర్ణమి అనే అర్థం వస్తుందని, కథలో చంద్రుడికి, చీకటికి, రూపాంతరాలకు సంబంధించిన అంశాలు ఉండొచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. కొందరు అయితే అల్లు అర్జున్ పాత్ర పగలు సాధారణ మనిషిగా, రాత్రి మరో రూపంలో కనిపించే అవకాశం ఉందని ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఈ విషయాలపై చిత్రబృందం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

అట్లీ గత చిత్రాలు 'జవాన్', 'బిగిల్', 'తెరి' వంటి సినిమాలు భారీ స్థాయిలో విజయాలు సాధించాయి. ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'పుష్ప'తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కూడా ఈ సినిమాను అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారని సమాచారం. ఇక మొత్తానికి ఫెమినా జార్జ్ ఎంట్రీతో 'రాకా'పై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్, అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్ కారణంగా వార్తల్లో నిలిచిన ఈ సినిమా.. ఇప్పుడు కొత్త నటీనటుల చేరికలతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే రోజుల్లో మిగతా నటీనటులపై అధికారిక ప్రకటనలు వస్తే 'రాకా' చుట్టూ ఉన్న హైప్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X