ఫిదా మ్యాజిక్.. రాకెట్‌లా దూసుకెళ్తున్న సాయిపల్లవి రెమ్యునరేషన్..

మలయాళంలో వచ్చిన ప్రేమమ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు సాయి పల్లవి. భాష అర్థం కాకపోయినా ప్రేమమ్ చిత్రంలో ఆమె నటన, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు.

By Rajababu

మలయాళంలో వచ్చిన ప్రేమమ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు సాయి పల్లవి. భాష అర్థం కాకపోయినా ప్రేమమ్ చిత్రంలో ఆమె నటన, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు. ఫిదా రిలీజ్ ముందు వరకు సాయి పల్లవి ఎప్పుడెప్పుడు తెలుగు తెరకు పరిచయం అవుతుందా అని ప్రేక్షకులు కళ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూశారు. సినిమా తర్వాత చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సాయి పల్లవి నటనకు ఫిదా అయిపోయారు.

ఊహించిన విధంగా క్రేజ్.. డిమాండ్

ఊహించిన విధంగా క్రేజ్.. డిమాండ్

ఫిదా రిలీజ్ తర్వాత సాయి పల్లవి గ్రాఫ్ ఒక్కసారిగా ఊహించని విధంగా మారిపోయింది. సాయి పల్లవి అని పిలువడం మానేసి భాన్సువాడ భానుమతి అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. సినీ పరిశ్రమలో వేదిక ఏదైనా గానీ, కార్యక్రమం ఏదైనా సాయి పల్లవి నామస్మరణతో మార్మోగిపోయింది. హీరోలుందరూ ఆసక్తి ఎదురు చేసేంతగా సాయి పల్లవి క్రేజ్ ఎంతగా పెరిగిపోయింది.

Recommended Video

Sai Pallavi Fidaa Movie like my daughter Says Sekhar Kammula
ఫిదాకు గుండెకాయ సాయి పల్లవి

ఫిదాకు గుండెకాయ సాయి పల్లవి

ఇటీవల జరిగిన ఫిదా సంబురాలు కార్యక్రమంలో సాయి పల్లవిని ఆకాశానికి ఎత్తేశారు. సాయి పల్లవి లేకుండా ఫిదాను ఊహించుకోవడం కష్టం అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఫిదా సినిమాకు సాయి పల్లవి గుండెకాయ అని శేఖర్ కమ్ముల పేర్కొనడం గమనార్హం. శేఖర్ కమ్ముల మాటను బట్టి చూస్తే ఫిదా విజయంలో ఆమె పాత్ర ఏంటో అర్థమవుతుంది.

కోటికి పడుగులెత్తుతున్న భానుమతి

కోటికి పడుగులెత్తుతున్న భానుమతి

ఫిదా సినిమాకు ముందు సాయి పల్లవి సుమారు 30 లక్షలు తీసుకొనేదని టాక్. ఫిదా ఘన విజయం తర్వాత సాయి పల్లవి ఒక్కసారిగా ఊహించని విధంగా రెమ్యునరేషన్ పెంచినట్టు సమాచారం. ప్రస్తుతం సాయి పల్లవి 70 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తాజా సమాచారం. రానున్న రోజుల్లో ఈ పారితోషికం విలువ కోటి రూపాయలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదనే మాట వినిపిస్తున్నది.

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి..

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి..

తన క్రేజ్‌ను బట్టి సాయి పల్లవి డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదంటున్నారు సినీ ప్రముఖులు. దీపం వెలుగుతున్నప్పుడే ఉన్నప్పుడే ఇల్లును చక్కబెట్టుకోవడం లాంటిదనే మాట చెబుతున్నారు. సినిమాల ఆఫర్లు భారీగా వస్తున్నప్పుడు ఆచీతూచీ వ్యవహరించాలని, డబ్బుల కోసం కెరీర్‌ను పణంగా పెట్టవద్దనే సూచనను కొందరు ఇస్తున్నట్టు తెలుస్తున్నది.

నాగశౌర్య, నానీలతో సాయి పల్లవి

నాగశౌర్య, నానీలతో సాయి పల్లవి

ప్రస్తుతం నాగశౌర్యతో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఫిదా తర్వాత దిల్ రాజు బ్యానర్లో నేచురల్ స్టార్ నానీతో ఎంసీఏ అనే చిత్రంలో సాయిపల్లవి నటిస్తున్నారు. ఇంకా ఓ తమిళ చిత్రాన్ని అంగీకరించినట్టు ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంకా కొన్ని చిత్రాలను అంగీకరించాల్సి ఉంది అని ఆమె చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X