బాలయ్య బాబుపై ఎస్‌ఎంఎస్ జోకులు పని చిరంజీవి అభిమానులదేనా?
ఇటీవల కాలంలో బాలయ్య బాబు పేరు మీద ఐహేట్ బాలయ్య్ అనే వెబ్ సైట్‌ని కోందరు బాలయ్య్ దురభిమానులు నడుపుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి బాలకృష్ణ మీద కామెడీ చేస్తూ వారు చేయని హాంగామ మరీ ఎక్కువగా ఉంది. ఈ వెబ్ సైట్ చూసినటువంటి నందమూరి అభిమానులు కోందరు తిట్టుకుంటే మరికోంత మంది ఇదంతా చిరంజీవి అభిమానుల పనేనని, చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోలపై జోకులు ప్రచారం చేశారు.
ఈ విషయాన్ని ఇన్నిరోజులు తెలిసి తెలియనట్టు వ్యవహారించిన బాలయ్య బాబు ఇటీవల మరీ ముదిరిపోతున్న ఎస్‌ఎంఎస్ జోకులతో సహానం కోల్పోయాడని వినికిడి. తనపై మాత్రమే కాకుండా జూ ఎన్టీఆర్ మీద కూడా కలిపి బాబాయ్ అబ్బాయ్ అనే పేరుతో వస్తున్నటువంటి ఎస్‌ఎంఎస్ జోకులు బాలయ్య బాబు కుటుంబం దృష్టికి కూడా వెళ్శాయి. ఇకమీదట దీనిని సహించేది లేదంటూ వీటిని కంట్రోల్ చేయాలంటూ బాలయ్య బాబు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
పోలీసులు కూడా దీనిని సీరియస్‌గా తీసుకోని కూపీ లాగే పనిలో పడ్డారు. ఐతే ఇది చిరంజీవి అభిమానుల పనేనన్నది బాలకృష్ణ ప్రగాఢ నమ్మకం. వారిని ఎలాగైనా జైల్లో పెట్టించి పగ తీర్చుకోవాలని బాలయ్య చూస్తున్నాడని సమాచారం. చిరంజీవిపై బాలయ్య బాబు ఇలా ఇన్ డైరెక్ట్‌గా యుద్దం ప్రకటించడం సంగతి ఎలా ఉన్నా కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి చిరంజీవి ఎవరో ఒకరు ఇద్దరు అభిమానులు చేసేటటువంటి ఇలాంటి చెడ్డపనులను ఎలా అరికట్టగలడు చెప్పండి..


Click it and Unblock the Notifications











