ఆ మ్యాటర్ లో బెల్లంకొండ సురేష్ కీ ప్రియమణికీ చెడిందా?
బెల్లంకొండ బ్యానర్ లో వరసగా శంభో శివ శంభో, గోలీమార్ చిత్రాలు చేసిన ప్రియమణి అది తన సొంత బ్యానర్ లాంటిదని స్టేట్ మెంట్ లు ఇచ్చింది. అయితే ఇప్పుడు బెల్లంకొండ తనకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టాడని గోలెడుతోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్న దాని ప్రకారం ప్రియమణికీ బెల్లంకొండ మధ్య రెమ్యునేషన్ నిమిత్తం ఓ ఎగ్రిమెంట్ జరిగి మూడు సినిమాలు దాకా అదే రేటుకు కంటెన్యూ అవుతానని ఫిక్స్ అయింది. అయితే బెల్లంకొండ అనుకున్న ప్రకారం ఆ డబ్బుచెల్లించకుండా ఇబ్బందిపెడుతున్నాడని వాపోతోందిట ప్రియమణి. అయితే ఆ రెండు సినిమాల వల్ల తనకు మిగిలిందేమీ లేదని, హీరోయన్ గా ఆ సినిమాలకు కలిసి రాలేదని, ఇచ్చిందే ఎక్కువ అని బెల్లంకొండ తెగేసి చెప్తున్నాడని అంటున్నారు. తెలుగులో ఖాళీగా ఉన్నప్పుడు రెండు సినిమాలు ఇచ్చి బిజీ చేయటమే గొప్పని చెప్తున్నాడని ఆమె భాధపడుతూ చెప్పుకుంటోందిట. ఇక ప్రియమణి తను ప్రస్తుతం రక్త చరిత్ర, రావణ్ లతో పెద్ద డైరక్టర్స్ సినిమా చేసి కెరీర్ లో ముందుకు వెళ్థున్నానని ఇటువంటి టైమ్ లో ఇలాంటి మాటలు వినటం కష్టమేనంటోందిట.


Click it and Unblock the Notifications











