ఎన్టీఆర్ పేరు కోసం కోల్ట్ వార్? అభిమానులు తికమక!

అయితే తారక రత్న తన పేరును 'ఎన్టీఆర్'గా మార్చుకోవడానికి ముందు నందమూరి కుటుంబంలో పెద్ద చర్చే జరిగినట్లు సమాచారం. ఇద్దురు ఒకే విధమైన పేర్లు పెట్టుకోవడం వల్ల అభిమానులు అయోమయానికి గురవుతారని కుటుంబంలోని కొందరు పెద్దలు ఎంత మొత్తుకున్నా తారకరత్న వినలేదని తెలుస్తోంది. పరిశ్రమలోకి వచ్చి ఇన్నేళ్లయినా సరైన ఫేత్ రాలేదు, ఒక్క పెద్ద హిట్టూ లేదు, తాత పేరు వాడుకుంటే తప్ప పరిశ్రమలో ఉనికి కాపాడుకునే పరిస్థితి లేదు అంటూ గొడవ చేసి మరీ తారక రత్న తన పేరును 'ఎన్టీఆర్' గా మార్చకున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ మనవడు అనే ఇమేజ్ మెల్లి మెల్లిగా తొలగించుకుని తన కంటూ సొంత బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకున్న జూ.ఎన్టీఆర్ తారక రత్న పేరు మార్పు విషయంలో కావాలనే సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్(తారక రత్న) ఈ నెల 23న నందీశ్వరుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











