"ఊసరవెల్లి", "దూకుడు"లపై ఫిల్మ్ ఛాంబర్
ఇటీవల విడుదలైన "ఊసరవెల్లి", "దూకుడు" చిత్రాలు రెండూ పోటీపోటీగా పబ్లిసిటీ కాంపైన్ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక రిలీజైన నాటి నుంచి మా మొదటి రోజు కలెక్షన్స్ ఇంత,రెండో రోజు ఇంత మొదటి వారం ఇంత అని కలెక్షన్స్ చెప్పటంతో పోటీ పడుతున్నాయి. రెండూ పెద్ద హీరోలు సినిమాలు కావంటోతో పోటీ తప్పని సరి అయ్యింది. అంతేగాక దూకుడు చిత్రానికి ఆల్రెడీ విజయయాత్ర మొదలు పెడితే, ఊసరవెల్లి కి కూడా విజయయాత్ర ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న ఫిల్మ్ ఛాంబర్...ఇలా రికార్డులు ప్రకటిస్తే రేపు హీరోల దగ్గరనుంచి సమస్య ఎదురవుతుందని, ఆ తర్వాత చిత్రాలు డేట్స్ కి వెళ్లినప్పుడు వారు ఈ రికార్డు లెక్కలు చూపి రెమ్యునేషన్స్ పెంచేస్తే భాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీసినట్లు సమాచారం. ఇద్దరి నిర్మాతలను సోమవారం నాడు ఫిల్మ్ ఛాంబర్ కాస్త రికార్డు లెక్కల జోరు తగ్గించమని రిక్వెస్ట్ చేసింది. ఇక దూకుడు చిత్రం ఇప్పటికీ రికార్డు కలెక్షన్స్ తో ముందుకు వెళ్తోందని ట్రేడ్ లో వినిపిస్తోంది. అలాగే ఊసరవెల్లి కి డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం స్టడీగానే ఉన్నట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











