దీపికా పదుకొణెకు చేతబడి.. చేయించిన స్టార్ హీరోయిన్ తల్లి.. అందుకే ఆ కష్టాలు.. ట్వీటుతో కలకలం
ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందింది దీపికా పదుకొణె. అలాగే బాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో టాప్ లిస్టులో ఉంది. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా విభిన్నంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దీపికపై స్టార్ హీరోయిన్ తల్లి చేతబడి చేయిందన్న వార్తలు ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి.
సెలబ్రిటీలపై కామెంట్స్: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో జరిగే సీక్రెట్ వ్యవహారాలు, అంతర్గత విషయాలు తనకు తెలుస్తాయంటూ ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తుంటాడు ఉమర్ సంధు. సెన్సార్ బోర్డ్ మెంబర్ గా, ఫిల్మ్ క్రిటిక్ గా చెప్పుకునే ఉమర్ సంధు వ్యాఖ్యలు చాలా వివాదస్పదమే కాదు.. షాకింగ్ గా కూడా ఉంటాయి. ఈసారి దీపికా పదుకొణెపై స్టార్ హీరోయిన్ తల్లి చేతబడి, అలియా భట్, దర్శక నిర్మాత కరణ్ జోహార్ వంటి ప్రముఖులపై ఊహించని కామెంట్స్ చేశాడు.

ఇద్దరు కారణం: బాలీవుడ్ కచ్చా మ్యాంగో బ్యూటిగా పేరు తెచ్చుకుంది పరిణితీ చోప్రా. ఇటీవలే ఈ ముద్దగుమ్మకు పొలిటిషీయన్ రాఘవ్ చద్దాతో నిశ్చితార్థం అయింది. అయితే పరిణితీ చోప్రా సినీ కెరీర్ ఫెయిల్యూర్ కావడానికి కారణం RRR బ్యూటి అలియా భట్, హిందీ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అని సినీ క్రిటిక్ ఉమర్ సంధు తన ట్వీటులో రాసుకొచ్చాడు.

విషపు నాగులు: "అలియా భట్, కరణ్ జోహార్ వల్లే పరిణితీ చోప్రా కెరీర్ ఫెయిల్యూర్ గా మారింది. నటన నుంచి కొంతకాలం గ్యాప్ తీసుకోని, మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వమని పరిణితీకి సలహా ఇచ్చినవాళ్లలో కరణ్ జోహార్ ఒకరు. తర్వాత పరిణితీ కెరీర్ ఎలా మారిపోయిందో తెలుసిందే. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కరణ్, అలియా భట్ విషపు నాగులు" అని ఉమర్ సంధు ట్వీట్ చేశాడు.
దీపికా అంటే ద్వేషం: మరొక ట్వీటులో అలియా భట్ పై తీవ్ర విమర్శలు గుప్పించాడు ఉమర్. "అలియా భట్ పెద్ద ఫేక్ నటి. ఆమె ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ఫేమస్ అయ్యేందుకు అనేకమంది ఇంటర్నేషనల్ ప్రమోటర్స్, పీఆర్ వాళ్లతో పడుకుంది. ఆమె దీపిక పదుకొణెకు వచ్చిన ఫేమ్ చూసి తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. దీపికాను ఎలాగైనా సరే పడగొట్టాలని చూసింది. మీరు అస్సలు ఊహించని విధంగా దీపికాను అలియా తీవ్రంగా ద్వేషిస్తుంది" అని చెప్పుకొచ్చాడు ఈ క్రిటిక్.
అలియా ఒక సైకో: "దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్ తో సినిమాలు చేసేందుకు ఎప్పుడూ ఒప్పుకోకూడదని రణ్‌బీర్ కపూర్ కు అలియా భట్ వార్నింగ్ ఇచ్చింది. దీపికా పదుకొణె కెరీర్, ఆమెకు ఉన్న ఇంటర్నేషనల్ ఫైమ్ పై అలియా తెగ అసూయ పడుతుంటుంది. అందుకే ఆమె, ఆమె తల్లి సోని రజ్దాన్ ఇద్దరు కలిసి దీపికా పదుకొణెపై చేతబడి చేయించారు. దాంతో ఒక వారం తర్వాత దీపికా అనారోగ్యం పాలైంది. అలియా భట్ ఒక సైకో" అని మరొక ట్వీటులో షాకింగ్ కామెంట్స్ చేశాడు ఉమర్ సంధు.
మాజీ ప్రేయసీలు: ఒక్కో సమయంలో చేసిన ఉమర్ సంధు ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ఇక అలియా భట్ భర్త రణ్‌బీర్ కపూర్ కు కత్రీనా కైఫ్, దీపికా పదుకొణె మాజీ ప్రేయసీలు అని తెలిసిందే. అందుంకే వాళ్లతో సినిమాలు చేయొద్దని భర్తకు వార్నింగ్ ఇచ్చినట్లుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











