'చేపల పులుసు' కథ అదే
తెలుగుదేశం మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి చేపల పులుసు అంటున్నారని కొద్ది రోజులుగా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చేపల పులుసు ఉదంతం మాత్రం తెలుగునాట పాపులర్ అయింది కోడిరామకృష్ణ సినిమాతో మాత్రమే. ఆయన డైరక్ట్ చేసిన ఓ చిత్రంలో వై.విజయ పాత్రతో ఈ చేపల పులుసుని పాపులర్ చేసారు. అందులో ఆమె తనకు నచ్చిన వారికి చేప పులుసు వండి పంపుతుంది. అది తిన్నవారు ఆ రుచి మర్ఛిపోలేక సాయింత్రానికి ఆమె గూటికి చేరుతారు. అలా వచ్చిన వారిని ఆమె లొంగతీసుకుని జీవితం కొనసాగిస్తూంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన నాటినుండీ అదే తరహాలో ఉండే వారిని చేపల పులుసు అని ఎద్దేవా చేయటం మొదలైంది. ఇక ఆ పాత్ర ఎంతగా పాపులర్ అయిందంటే వై.విజయను అటువంటి పాత్రలో తప్ప వేరే విధంగా చూడటానికి తెలుగు ప్రేక్షకులు ఇష్టపడలేదు. ఆమె ప్రతీ రెండు సినిమాల్లోను ఒక దానిలో సెక్సీ గా ఉండి మెగాళ్ళను రెచ్చగొట్టే నెగిటివ్ పాత్ర చేస్తూండేది. ఇక ఇటువంటి పాత్రలు రాజకీయాల్లో కూడా ప్రవేశించటంతో చేపల పులుసు క్యారెక్టర్స్ ని గురించి అక్కడా ప్రచారం మొదలైంది.


Click it and Unblock the Notifications











