Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తారా చౌదరి జీవిత కథతో సినిమా
గత కొద్ది రోజులుగా అంతటా కలకలం సృష్టిస్తున్న తారా చౌదరి జీవిత సంఘటనలను చాలా మంది క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆమె జీవిత చరిత్ర అని అర్దం వచ్చేలా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ లో సిల్క్ స్మిత జీవితం ఆధారంగా సినిమా వచ్చినట్లే ఇక్కడా తారా చౌదరి జీవితం ఆధారంగా సినిమా తీయాలని నిర్ణయించుకుని అందుకు తగినట్లు టైటిల్స్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయిస్తున్నారు. ఆ టైటిల్స్ ఏమిటంటే.. తారాజువ్వ,తారావిలాసం,తారాతోరణం,ఒంపుసొంపుల వయ్యారి,కెమెరారాణి. ఇపి ప్రస్తుతానికి రిజిస్టర్ అయిన కొన్ని టైటిల్స్.
వ్యభిచారగృహం నిర్వహిస్తూ ఇటీవల జైలుపాలైన సినీనటి తారాచౌదరి జీవిత చరిత్రపై సినిమాలు తీసేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారు. అనుకోకుండా వచ్చిన ఈ కథను తెరకెక్కించడానికి నిర్మాతలు యత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెండురోజుల వ్యవధిలో తారా చౌదరి జీవితంపై తీసే సినిమా కథకు సంబంధించి ఎనిమిది టైటిళ్లు నమోదు చేశారంటేనే ఆ క్రేజ్ ఏ రేంజిలో ఉందో అర్దం చేసుకోవచ్చు. రోజుకు నాలుగు సినిమా టైటిళ్లు తారాచౌదరి జీవితంపై నమోదవుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఆమె జీవితంపై సినిమా తీసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఒక అమాయక గ్రామీణ యువతి వెండితెర మీద వెలిగిపోవాలని ఫిలింనగర్‌కు వచ్చి ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొంది, సినిమాల్లో అవకాశం రాక వ్యభిచారకూపంలోకి ఎలా కూరుకుపోయింది..విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి తనతో గడిపినవారి నగ్నదృశ్యాలను స్పై కెమెరాల్లో బంధించి బ్లాక్మెయిల్ చేస్తూ ఎలా కోట్లు గడించింది, ఆ తరువాత ఎలా జైలు పాలైందన్న విషయాలను ఈ సినిమాలో చూపించేందుకు యత్నిస్తున్నారు.
ఏమిటీ ఈమె కధపై ఇంత ఆసక్తి అంటే....ఈ సినిమా హాట్ కేక్‌లా అమ్ముడుపోవడం ఖాయమని అంటున్నారు. ఎవరికి తోచిన సినిమా టైటిళ్లు వారు నమోదు చేసుకుంటూ హంగామా క్రియేట్ చేస్తున్నారు. ఎవరు ముందు సినిమా మొదలుపెడితే వారిదే తార జీవిత చరిత్రపై సినిమా అవుతుందని చాలామంది తొందరపడుతున్నారు.
సినిమా హీరోయిన్ అవుదామని వచ్చి వేరే దారిలేక ఇక్కడ వ్యభిచారంలో చిక్కుకుపోయానని చెప్తోంది. ఇక ఆమె సినిమాల మొజుతో వచ్చే చాలా మందిని ట్రాప్ చేసి మరీ వ్యభిచారంలోకి దింపిందంటూ అసలు ఈ కేసు మొదలైంది. మరో ప్రక్క ఈమె టేపులు ఇప్పుడు రాజకీయ,సినీ వర్గాల్లో బాంబులు పేలుస్తున్నాయి. ఈమెతో కొద్దిపాటి పరిచయం ఉన్నవాళ్లు సైతం ఆమె పేరు చెపితే ఉలిక్కిపడుతున్నారు. ఆమె సెల్ లో తమ నెంబర్లు ఉన్నాయేమో అని కంగారుపడుతున్నారు.