twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తారా చౌదరి జీవిత కథతో సినిమా

    By Srikanya
    |

    గత కొద్ది రోజులుగా అంతటా కలకలం సృష్టిస్తున్న తారా చౌదరి జీవిత సంఘటనలను చాలా మంది క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆమె జీవిత చరిత్ర అని అర్దం వచ్చేలా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ లో సిల్క్ స్మిత జీవితం ఆధారంగా సినిమా వచ్చినట్లే ఇక్కడా తారా చౌదరి జీవితం ఆధారంగా సినిమా తీయాలని నిర్ణయించుకుని అందుకు తగినట్లు టైటిల్స్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయిస్తున్నారు. ఆ టైటిల్స్ ఏమిటంటే.. తారాజువ్వ,తారావిలాసం,తారాతోరణం,ఒంపుసొంపుల వయ్యారి,కెమెరారాణి. ఇపి ప్రస్తుతానికి రిజిస్టర్ అయిన కొన్ని టైటిల్స్.

    వ్యభిచారగృహం నిర్వహిస్తూ ఇటీవల జైలుపాలైన సినీనటి తారాచౌదరి జీవిత చరిత్రపై సినిమాలు తీసేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారు. అనుకోకుండా వచ్చిన ఈ కథను తెరకెక్కించడానికి నిర్మాతలు యత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెండురోజుల వ్యవధిలో తారా చౌదరి జీవితంపై తీసే సినిమా కథకు సంబంధించి ఎనిమిది టైటిళ్లు నమోదు చేశారంటేనే ఆ క్రేజ్ ఏ రేంజిలో ఉందో అర్దం చేసుకోవచ్చు. రోజుకు నాలుగు సినిమా టైటిళ్లు తారాచౌదరి జీవితంపై నమోదవుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఆమె జీవితంపై సినిమా తీసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

    ఒక అమాయక గ్రామీణ యువతి వెండితెర మీద వెలిగిపోవాలని ఫిలింనగర్‌కు వచ్చి ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొంది, సినిమాల్లో అవకాశం రాక వ్యభిచారకూపంలోకి ఎలా కూరుకుపోయింది..విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి తనతో గడిపినవారి నగ్నదృశ్యాలను స్పై కెమెరాల్లో బంధించి బ్లాక్‌మెయిల్ చేస్తూ ఎలా కోట్లు గడించింది, ఆ తరువాత ఎలా జైలు పాలైందన్న విషయాలను ఈ సినిమాలో చూపించేందుకు యత్నిస్తున్నారు.

    ఏమిటీ ఈమె కధపై ఇంత ఆసక్తి అంటే....ఈ సినిమా హాట్ కేక్‌లా అమ్ముడుపోవడం ఖాయమని అంటున్నారు. ఎవరికి తోచిన సినిమా టైటిళ్లు వారు నమోదు చేసుకుంటూ హంగామా క్రియేట్ చేస్తున్నారు. ఎవరు ముందు సినిమా మొదలుపెడితే వారిదే తార జీవిత చరిత్రపై సినిమా అవుతుందని చాలామంది తొందరపడుతున్నారు.

    సినిమా హీరోయిన్ అవుదామని వచ్చి వేరే దారిలేక ఇక్కడ వ్యభిచారంలో చిక్కుకుపోయానని చెప్తోంది. ఇక ఆమె సినిమాల మొజుతో వచ్చే చాలా మందిని ట్రాప్ చేసి మరీ వ్యభిచారంలోకి దింపిందంటూ అసలు ఈ కేసు మొదలైంది. మరో ప్రక్క ఈమె టేపులు ఇప్పుడు రాజకీయ,సినీ వర్గాల్లో బాంబులు పేలుస్తున్నాయి. ఈమెతో కొద్దిపాటి పరిచయం ఉన్నవాళ్లు సైతం ఆమె పేరు చెపితే ఉలిక్కిపడుతున్నారు. ఆమె సెల్ లో తమ నెంబర్లు ఉన్నాయేమో అని కంగారుపడుతున్నారు.

    English summary
    Some Producers want to make film with Tara Chowdary life. Telugu actress Tara Chowdary was arrested by the Banjara Hills police for her brothel acts. She also forced innocent girls into prostitution by offering them jobs.Tara Chowdary is side-kick in Telugu movies like Adrusyam, Rakshakudu, Priya Sakhi and Love ticket. She has done the role of Rajasekhar's sister in many of his movies. A Vizag girl lodged complaint that Tara is forcing her into prostitution and the police arrested this actress. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X