twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫైనల్ గా పవన్ కళ్యాణ్ తో దీపికా పడ్కోని

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్..జయంత్ పరాంన్జీ కాంబినేషన్లో లవ్ ఆజ్ కల్ రీమేక్ అనగానే అంతా పవన్ సరసన దీపిక పడుక్కోని చేస్తుందని ఊహించారు. అయితే అనూష్క ని తీసుకుని అందరికీ ట్విస్ట్ ఇచ్చారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు అంతా ఈ చిత్రం ఒరిజనల్ లో దీపికా చేస్తే బావుంటుందనే ఆసక్తి వ్యక్తం చేయటం గమనించిన జయంత్..దీపికను ఒప్పించాడని సమాచారం. అయితే డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని ఓ గెస్ట్ పాత్రలో కనిపిస్తానని ఆమె కమిట్ అయ్యిందని తెలుస్తోంది. ఇక ఇదంతా జయంత్ తో ఆమెకు ఉన్న స్నేహం వల్లే సాధ్యం అయ్యిందని అంటున్నారు. అలాగే ఇంతకు ముందు కూడా జయంత్ పరాన్జీ..ఐశ్వర్యారాయ్ ని ఒప్పించి నాగార్జున సరసన రావోయి చందమామ చిత్రంలో చేయించారు.

    ఇక దీపిక..అంతా కొత్తవాళ్ళతో జయంత్ చేసిన లవ్ ఫర్ యు చిత్రంలోనూ ఐటం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. త్రివక్రమ్ డైలాగులు రాస్తున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ ఒకటి నుంచి ప్రారంభం కానుంది. గణేష్ బాబు నిర్మిస్తున్నఈ చిత్రం యుయుస్ లో షూటింగ్ జరగనుంది. అందుకోసం ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిందు ప్రధాన్ ఈ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. ఇక లవ్ ఆజ్ కల్ చిత్రం స్క్రీన్ ప్లే ప్రకారం పవన్ కళ్యాణ్ రెండు పాత్రలు వేయనున్నారు. ఇక హిందీలో 'లవ్ ఆజ్ కల్" చిత్రంలో సైఫ్ ఆలీ ఖాన్, దీపిక పదుకొనే నటించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X