ఆమెను వదల్లేకే..యువరాజ్ సింగ్

ఇక కిమ్ శర్మ ను తిరిగి తన దగ్గరకు రప్పించుకునేందుకు చాలా సార్లు యువరాజ్ ప్రయత్నించాడని, అయితే ఆమె పట్టించుకోకపోవటం ఆమెను బాధించిందని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఐపిల్ టీమ్ తో సౌత్ ఆఫ్రికాలో ఉన్న అతనిపై అక్కడ కూడా ప్రీతి జింతాతో సన్నిహితంగా ఉన్నాడంటూ రూమర్స్ వినపడ్డాయి. అయితే యువరాజ్ స్వయంగా కిమ్ ని సౌత్ ఆఫ్రికాకు రమ్మన్నాడు. దాంతో ఏ మొహమాటం లేకుండా కిమ్ అక్కడికి తన స్నేహితురాళ్ళతో చేరింది. దాంతో ఇప్పుడు ఇద్దరూ ఒకటయ్యారు.
అయితే ఈ విషయంపై కిమ్ స్పందిస్తూ..కొన్ని సంబంధాలు ఎప్పటికీ చచ్చిపోవు. మదిలో ఏదో ఒక మూల ఆ సంబంధాల తాలూకు అనుభూతులు కదలాడుతూనే ఉంటాయి. మరిచిపోదామన్నా మర్చిపోలేరు. అలాగే యూవీ కూడా నన్ను మరువలేకపోతున్నాడు. అతను నాతో స్నేహం కొనసాగించాలనున్నప్పుడు నేనెలా కాదంటాను అని చెప్తోంది. మొత్తానికి తెలివైందే అంటున్నారు.
kim sharma yuvraj singh deepika padukone ipl team south africa preity zinta యువరాజ్ సింగ్ కిమ్ శర్మ దీపికా పడ్కోని సౌత్ ఆఫ్రికా ప్రీతి జింతా


Click it and Unblock the Notifications