ఈ స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. షాక్ అవ్వాల్సిందే!

ఏ సినిమా చేసిన హీరో అయినా.. హీరోయిన్ అయినా రెమ్యూనరేషన్ కింద డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడంటే... స్టార్ హీరోలకు కోట్లలో డబ్బులు ఇస్తున్నారు. సినిమా బడ్జెట్ కంటే.. హీరో పారితోషకం ఎక్కువ ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు స్టార్ హీరోలుగా కోట్లు తీసుకుంటున్న వాళ్ల అప్పట్లో మొదటి సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా. ఆ వివరాల్లోకి వెళితే....

ఒకప్పుడు ఎన్టీఆర్, ఏన్నార్ కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో చాలా కండిషన్స్, షరతులు ఉండేవి. అప్పుడు దర్శక నిర్మాతలు ఎంత ఇస్తే.. అదే పారితోషికంగా తీసుకునేవారు. అప్పట్లో నటనపై దృష్టి, సినిమా పూర్తి చేయాలి.. మంచి పేరు తెచ్చుకోవాలని మాత్రమే ఆలోచించేవారు. రెమ్యూనరేషన్ గురించి పట్టించుకునే వారు కాదు. ఇప్పుడు కాలం మారింది. హీరోలకు కాస్త స్టార్ డమ్ వస్తే కోట్లాది రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారి మొదటి రెమ్యూనరేషన్ వివరాలు తెలుసుకుందా.

First remuneration details of Tollywood heroes

మెగాస్టార్ చిరంజీవి :ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... మెగాస్టార్ గా ఎదిగారు. చిరంజీవి. వరుస సినిమాలు, తనదైన నటన, డ్యాన్స్ లతో ప్రేక్షకులను మెప్పించి ఈ స్థాయికి వచ్చారు. గత ఏడాది గాడ్ ఫాదర్, ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాలతో సందడి చేసిన చిరంజీవి.. కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ.. సినిమాలు చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమా రెమ్యూనరేష్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. మొదటి మూవీకి రూ.1116 పారితోషికం తీసుకున్నారట. ప్రస్తుతం ఆయన ఒక్కో చిత్రానికి రూ.50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.

First remuneration details of Tollywood heroes

మహేశ్ బాబు:సూపర్ స్టార్ మహేశ్ బాబు... కృష్ణ నటవారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆయన నటించిన మొదటి సినిమా రాజ కుమారుడు. ఇక ఈసినిమా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. ప్రితి జంట హీరోయిన్ గా చేసింది. ఇక ఈ సినిమాలో మహేశ్ క్యూట్ లుక్స్ తోనూ, యాక్టింగ్, డాన్స్ లతో ఆకట్టుకున్నాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు మహేశ్ 10లక్షల రూపాయలు తీసుకున్నారని సమాచారం.

First remuneration details of Tollywood heroes

అల్లు అర్జున్ :పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. మొదటి సినిమా గంగోత్రితో.. ఎవరబ్బా ఈ కుర్రాడు ఇలా ఉన్నాడు అనుకున్నారు అంతా. ఇప్పుడు స్టైల్ అంటే ఇదిరా అన్నట్లు ఎదిగాడు బన్నీ. అయితే బన్నీ ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ కేవలం 4లక్షల రూపాయలు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా బన్నీకి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇప్పుడు ఐకానిక్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం బన్నీఒక్కో మూవీకి రూ.80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

First remuneration details of Tollywood heroes

పవన్ కళ్యాణ్- ప్రభాస్ :మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి.. పవర్ స్టార్ గా ఎదిగాడు పవన్ కల్యాణ. ఈయన తొలి సినిమా అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. ఈ చిత్రానికి పవన్ 5 లక్షలు తీసుకున్నారని సమాచారం. ఇక ప్రభాస్.. కృష్ణం రాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్. ఈ సినిమాకు ప్రభాస్ 5 లక్షలు తీసుకున్నాడట. ఇక విజయ్ దేవరకొండ ఫస్ట్ మూవీ లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్. అయితే ఈ సినిమాకు అసలు రెమ్యూనరేషన్ తీసుకోలేదని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X