»   » ఈ సారి కూడా పవన్ కళ్యాణ్ డుమ్మా? వారం తర్వాతే..

ఈ సారి కూడా పవన్ కళ్యాణ్ డుమ్మా? వారం తర్వాతే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ(కిషోర్ పార్దసాని) దర్శకత్వం ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు 6 నుండి మొదలు కాబోతోంది. తాజాగా యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ సినిమా తొలి షెడ్యూల్ కు పవన్ కళ్యాణ్ డుమ్మా కొడుతున్నాడట. షూటింగ్ మొదలైన వారం తర్వాతే పవన్ కళ్యాణ్ షూటంగులో జాయిన్ అవుతారట.

Also Read: దాన్ని అమ్మేసాడా?: పవన్ కళ్యాణ్ స్థితి అంత దారుణంగా ఉందా?

మరి తొలి షెడ్యూల్ లో ఆయనకు సీన్లు లేవా? లేక ఆయన వేరే పనుల వల్ల బిజీగా ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ లేని సీన్లను తొలి షెడ్యూల్‌లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారా? అనేది అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గత సినిమా 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలానే చేసాడు.

పవన్ కళ్యాణ్ లేకుండానే 'సర్దార్ గబ్బర్ సింగ్' తొలి షెడ్యూల్ పూర్తి చేసారు అప్పట్లో. ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? అంటే ఇలా చేయడం ఆయనకు సెంటిమెంటు అంటూ ఆయన సన్నిహితులు చెప్పడం గమనార్హం. మరి నిజంగానే ఇలాంటి సెంటిమెంటు వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంటే 'సర్దర్..' మూవీ బాక్సాఫీసు వద్ద ఎందుకు అలా అయిందో?

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో...

హీరోయిన్

హీరోయిన్

పవన్ కళ్యాణ్ సరసన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా ఖరారైంది. డైరెక్టర్ డాలీ అండ్ టీం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి షూటింగుకు సిద్దంగా ఉన్నారు.

రేణు దేశాయ్ తర్వాత..

రేణు దేశాయ్ తర్వాత..

తన మాజీ భార్య రేణు దేశాయ్ తో తప్ప పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏ హీరోయిన్ తోనూ రెండో సారి చేయలేదు. రేణు దేశాయ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో రెండోసారి నటిస్తున్న హీరోయిన్ శృతి హాసన్ మాత్రమే అని అంటున్నారు.

చేతులు మారింది.

చేతులు మారింది.

సర్దార్ గబ్బర్ సింగ్ మాదిరిగానే ఈ సినిమా కూడా చేతులు మారింది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఎస్.జె.సూర్య చేతి నుండి డైరెక్టర్ డాలీ(కిషోర్ పార్ధసాని... గోపాల గోపాల ఫేం) చేతిలోకి వచ్చింది. 'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీ రిజల్ట్ అంచనాలను తారుమారు చేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై చాలా కేర్ తీసుకుంటున్నారు.

ప్రయోగాల్లేవ్

ప్రయోగాల్లేవ్

'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా విషయంలోనూ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా జాగ్రత్తగానే తీసినప్పటికీ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ మిస్సవ్వడమే దెబ్బతీసిందని భావించిన పవన్ కళ్యాణ్ అండ్ టీం తాజా సినిమాలో అవన్నీ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

దీని తర్వాత

దీని తర్వాత

తమిళంలో శివ దర్శకత్వంలో తెరకెక్కిన వేదాళం చిత్రం అక్కడ రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తే బావుంటుందని ప్రముఖ నిర్మాత ఎఎం.రత్నం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు ఎఎం.రత్నం ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది.

English summary
Pawan Kalyan's forthcoming film is all set to commence from Aug 6. However, the film's shoot would start without Pawan. Director Dolly is going to begin the shooting in the absence of the protagonist and Pawan is expected to join the film's shoot only after few days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X