Ram charan 15: మొదటిసారి పొదుపుగా ఆలోచిస్తున్న శంకర్.. అలాంటి సీన్స్ ఉండవట.. బడ్జెట్ కోసం తప్పట్లేదు!

ఇండియన్ టాప్ మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో ఒకరైన శంకర్ ఎలాంటి సినిమా స్టార్ట్ చేసినా కూడా అభిమానుల అంచనాలకు అండకూడదు అనేలా తెరకెక్కిస్తుంటారు. పాన్ ఇండియా అనే పదానికి మొదటి అర్దాన్ని చెప్పిన శంకర్ నెక్స్ట్ రామ్ చరణ్ సినిమా కోసం మాత్రం తన రెగ్యులర్ అలవాట్లను మానుకొనున్నాడట. బడ్జెట్ విషయంలో చాలా పొదుపుగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఆ సినిమా నుంచి..

ఆ సినిమా నుంచి..

దర్శకుడు శంకర్ తో వర్క్ చేసే నిర్మాతలు కూడా హై లెవెల్లోనే ఆలోచిస్తూ బడ్జెట్ విషయంలో పెద్దగా ఇబ్బంది పెట్టే వాళ్ళు కాదు. కానీ అదంతా ఒకప్పుడు. వరుసగా 'స్నేహితుడు' నుంచి శంకర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేడా కొట్టేస్తున్నాయి. అనుకున్నంతగా లాభాలను అందించడం లేదు. 2.ఓ కూడా గట్టి దెబ్బె కొట్టింది.

ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు..

ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు..

ఇక ఇండియన్ 2పై గత అపజయాల ప్రభావం కూడా గట్టిగానే పడ్డట్లు ఋజువయ్యింది. లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 2 బడ్జెట్ విషయంలో తీవ్రస్థాయిలో కండిషన్స్ కూడా పెట్టింది. ఇక విబేధాలు రావడంట్ ఆ సినిమా కోసం కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఇంకా ఎవరికి తెలియదు.

ఎలాంటి పొరపాటు జరగకుండా

ఎలాంటి పొరపాటు జరగకుండా

అయితే దిల్ రాజుతో నిర్మించనున్న రామ్ చరణ్ 15వ సినిమా కోసం మాత్రం ఎలాంటి పొరపాటు జరగకుండా శంకర్ ముందే ప్లాన్ సెట్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఒక పర్ఫెక్ట్ బడ్జెట్ కూడా సెట్ చేసుకున్నారట. ఇక శంకర్, దిల్ రాజు ఇచ్చిన ఎమౌంట్ కంటే తక్కువలోనే ఫినిష్ చేయాలని ఆలోచిస్తున్నాడట.

Recommended Video

RC 15 : AR Rahman Likely To Join Ram Charan Pan India Movie
బడ్జెట్ కోసం ఆలోచించి

బడ్జెట్ కోసం ఆలోచించి

ఇక శంకర్ సినిమాల్లో గ్రాఫిక్స్ కు ఎంతోకొంత ప్రాధాన్యత ఉంటుంది. పాటల్లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలని అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తుంటాడు. అయితే ఇప్పుడు బడ్జెట్ కోసం ఆలోచించి పాటల్లో కూడా గ్రాఫిక్స్ పెద్దగా వాడకూడదని డిసైడ్ అయ్యారట. ఇక సినిమా పొలిటికల్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కనున్నట్లు సమాచారం. 2023లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X