Mega 156 : మెగాస్టార్ చిరంజీవితో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరెవరికి ఈ ఛాన్స్ దక్కిందంటే?
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటే చాలు ఆయన అభిమానులు అంతా పూనకాలతో ఊగిపోతుంటారు. దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి.. ఖైదీ నెంబర్ 150 సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆ తర్వాత సైరా నరసింహా రెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. అయితే తాజాగా చిరంజీవి, యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు మల్లిడి వశిష్టతో ఓ సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రానికి Mega 156 అనే వర్కింగ్ టైటిల్ ను ఖరారు చేశారు.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మెగా అభిమానులు అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి సినిమాకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ ను తెలుసుకునేందుకు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. గూగుల్ లో సెర్చ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఓవైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు నటీనటుల ఎంపిక కూడా జరగుతోంది. ఈక్రమంలోనే ఓ అదిరిపోయే అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. Mega 156 సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లను కన్ఫార్మ్ చేయగా.. మరో ఇద్దరి కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరగా హీరోయిన్లును ఫిక్స్ చేసుకుంటే.. షూటింగ్ కూడా ప్రారంభించవచ్చని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో చిరు సరనస ఆడి పాడేందుకు ఇప్పటికే అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్, కాజల్ అగర్వాల్ లను తీసుకున్నారు. వీరు కూడా సినిమాకు ఓకే చెప్పగా.. వీరు ముగ్గురూ ఫైనల్ అయిపోయారు. అయితే మరో ఇద్దరికి అవకాశం ఉండగా.. ఎవరిని తీసుకుంటారా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
చిరంజీవి కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలిసినప్పటి నుంచి అంతా కథ ఎలా ఉంటుందా అని తెలుసుకునేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. అలాగే సోషియో ఫాంటసీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా మూడు లోకాల చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. దేవ, మానవ, పాతాళ లోకాల్లో ఓ పాప చుట్టూ తిరుగుతుందట.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చిరుకు విలన్ గా రానా దగ్గుబాటి కనిపించబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మనం ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. అలాగే ఈ సినిమాలో నటించే నటీనటులు పూర్తి వివరాలు తెలియాలన్న ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











